Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వచ్చే నెలలో అందుబాటులోకి సింగిల్‌ టీకా !

తగ్గిన ఆర్‌-ఫ్యాక్టర్‌
కేరళ`మహారాష్ట్రలో కోవిడ్‌ జోరు

న్యూదిల్లీ : భారత్‌లో కరోనా ఉధృతి తగ్గడంతో ఆర్‌-ఫ్యాక్టర్‌ రేటు తక్కువగా నమోదు అయింది. కేసులు పెరిగినాగానీ తీవ్రత తగ్గడం కాస్త ఊరటనిస్తోంది. ఆగస్టు మొదటి వారంలో ఆర్‌-ఫ్యాక్టర్‌ విలువ ఒకటి కంటే ఎక్కువగా ఉండగా అది క్రమంగా తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్ల డిరచారు. మూడో దశ వ్యాప్తి తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో ఆర్‌-ఫ్యాక్టర్‌ తగ్గడం శుభపరిణామంగా చెప్ప వచ్చు. కేరళలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉంది. బుధవారం 21,427 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలోని రోజువారీ కేసుల్లో 59శాతం ఈ రాష్ట్రం లోనే నమోదు అవుతున్నాయి. ఆ తర్వాత స్థానంలో ఉన్న మహారాష్ట్రలో తాజాగా 5,132 మంది కోవిడ్‌ బారినపడ్డారు. ఇదిలావుంటే, కొత్తగా మూడు వాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అందులో ఒకటి స్పుత్నిక్‌ వీ లైట్‌. రష్యాకు చెందిన గమలేరియా సంస్థ ఈ టీకాను తయారు చేసింది. ఇప్పటికే అనేక దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. పనాసియా బయోటెక్‌ సంస్థ రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో ఒప్పందం కుదుర్చుకొని భారత్‌లో అత్యవసర అనుమతుల కోసం ధరఖాస్తు చేసుకుంది. ఈ వాక్సిన్‌ డేటాను భారత్‌ డ్రగ్‌ కంట్రోల్‌ త్వరలోనే పరిశీలించే అవకాశం ఉంది. దీంతో సెప్టెంబరు నాటికి స్పుత్నిక్‌ వీ లైట్‌ భారత్‌లో అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే స్పుత్నిక్‌ వీ వాక్సిన్‌ వాడుకలో ఉంది. స్పుత్నిక్‌ వీ రెండు డోసుల వ్యాక్సిన్‌ కాగా, స్పుత్నిక్‌ వీ లైట్‌ వ్యాక్సిన్‌ సింగిల్‌ డోస్‌ వాక్సిన్‌. పరాగ్వేలో స్పుత్నిక్‌ వీ లైట్‌ 93.5 శాతం సామర్ధ్యాన్ని కనబరిచిందని ఆర్డీఐఎఫ్‌ పేర్కొంది. రష్యాలో మే నెలలో ఈ వాక్సిన్‌కు అనుమతిచ్చారు. అప్పట్లో 79.4 శాతం సామ ర్థ్యాన్ని ఈ వాక్సిన్‌ నమోదు చేసినట్లు ఆర్‌డీఐఎఫ్‌ హెడ్‌ కిరిల్‌ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img