Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వరుసగా అయిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ లోక్‌సభలో బడ్జెట్‌ 2023ను ప్రవేశపెట్టారు. అయిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆరో మంత్రిగా ఆమె రికార్డు క్రియేట్‌ చేశారు. వరుసగా అయిదోసారి ఆమె బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను అయిదుసార్లు ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రుల్లో మన్మోహన్‌ సింగ్‌, అరుణ్‌ జైట్లీ, పి చిదంబరం ఉన్నారు. 2019 నుంచి నిర్మల వరుసగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అరుణ్‌ జైట్లీ, చిదంబరం, యశ్వంత్‌ సిన్హా, మన్మోహన్‌ సింగ్‌, మొరార్జీ దేశాయ్‌లు అయిదుసార్లు వరుసగా బడ్జెట్లను ప్రవేశపెట్టిన వారి జాబితాలో ఉన్నారు. 2014లో నిర్మల తొలిసారి మోదీ క్యాబినెట్‌లో ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే జైట్లీ 2014 నుంచి 2018 వరకు జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2018-19లో ఆరోగ్య సరిగా లేని కారణంగా జైట్లీ బదులుగా పీయూష్‌ గోయల్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2019లో తొలిసారి సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1971లో ఇందిరా గాంధీ తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండవ మహిళగా నిర్మల నిలిచారు.యూపీఏ పాలనలో చిదంబరం వరుసగా 2004-05 నుంచి 2008-09 వరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. యశ్వంత్‌ సిన్హా 1998-99లో తొలిసారి, ఆ తర్వాత 1999-2000 నుంచి 2002-03 వరకు ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సిన్హా సమయంలోనే బడ్జెట్‌ను సాయంత్రం 5 నుంచి ఉదయం 11 గంటలకు మార్చారు. నర్సింహారావు ప్రభుత్వంలో మన్మోహన్‌ సింగ్‌ 1991-92 నుంచి 1995-96 మధ్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img