Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు


దేశ వ్యాప్తంగా వరుసగా మూడోరోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి.దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ తాజాగా తీసుకున్న నిర్ణయంతో దేశంలో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. తాజాగా శనివారం లీటర్‌ పెట్రోల్‌ పై 25 పైసలు, డీజిల్‌పై 33 పైసలు పెరిగింది.ఢల్లీిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.14 ఉండగా.. డీజిల్‌ రూ .90.47గా ఉంది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.108.19 కి పెరగగా.. డీజిల్‌ ధర రూ .98.16 కి చేరింది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.77 ఉండగా.. డీజిల్‌ రూ. 93.57 కి చేరింది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ .99.80 కి పెరగగా.. డీజిల్‌ ధర రూ .95.02 కి చేరింది.తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.26కి పెరగగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 98.72 కి చేరింది.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.108.57 కు పెరగగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.100.45 కి చేరింది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ.107.19 కి చేరగా.. డీజిల్‌ ధర రూ. 99.14గా ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశీయ పెట్రోలియం కంపెనీలు వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img