Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వరుసగా రెండోరోజు 20వేల పైనే కరోనా కేసులు

దేశంలో కొత్తగా 20,038 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,37,10,027కు చేరాయి. ఇందులో 4,30,45,350 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,604 మంది మృతిచెందారు. మరో 1,39,073 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత కొన్నిరోజులుగా భారీగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసులు 5 నెలల తర్వాత మొదటిసారిగా గురువారం 20 వేలు దాటిన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో 47 మంది కరోనాకు బలయ్యారని, 16,994 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర హోంశాఖ వెల్లడిరచింది. ఇక మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.49 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతానికి చేరిందని పేర్కొన్నది. ఇప్పటివరకు 199.47 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img