Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వరుసగా రెండోరోజూ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కొత్తగా 20,557 పాజిటివ్‌ కేసులు
దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ కరోనా కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగాయి. బుధవారం 18 వేల కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 20,557కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,39,59,321కి చేరింది. ఇందులో 4,32,86,787 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,211 మంది మరణించారు. మరో 1,46,323 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 44 మంది మరణించగా, 19,216 మంది బాధితులు వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.47 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు 203.21 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 5.18 శాతానికి పెరిగిందని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img