Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వసుమతి దేవికి కన్నీటీ వీడ్కోలు

శోకసంద్రంలో అయినంబాకం
పలువురు ప్రముఖల నివాళి
కన్నీటి పర్యంతమైన పార్టీ శ్రేణులు
దిగ్భ్రాంతికి గురయ్యాడీ.రాజా పార్టీకి తీరని లోటుకె.రామకృష్ణ
మెడికల్‌ కాలేజికి పార్థివదేహం అప్పగింత

విశాలాంధ్ర బ్యూరోతిరుపతి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సతీమణి వసుమతి దేవికి శుక్రవారం సాయంత్రం కన్నీటి వీడ్కోలు పలికారు. నారాయణ స్వగ్రామం అయినంబాకం శోకసంద్రంలో మునిగిపోయింది. వసుమతి దేవి ఆకస్మిక మృతిని పార్టీ శ్రేణలు జీర్ణించుకోలేకపోయాయి. దశాబ్ధాల కాలం కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా బావిస్తూ ఆప్యాయంగా పలకరించే వసుమతి ఇక లేరని తెలిసి కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు. చిత్తూరు జిల్లా నుండే కాకుండా ఆంధ్ర, తమిళనాడు óతెలంగాణ రాష్ట్రాల నుండి శుక్రవారం ఉదయానికే వందలాది మంది నగరి మండలం అయినంబాకం చేరుకున్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో పాటు పార్టీ అగ్రనాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు అయినంబాకం చేరుకుని వసుమతి దేవి పార్థీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నారాయణ, కుటంబ సభ్యులను ఓదార్చారు. పార్టీతో అమెకు వున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. అయినంబాకంలో బందువులు కార్యకర్తలు మిత్రులు పెద్దఎత్తున తరలివచ్చి చివరి సారిగా వసుమతి దేవి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానికులు పలువురు కన్నీటి పర్యంతం అయ్యారు. శుక్రవారం మద్యాహ్నం పార్థీవ దేహాన్ని అయినంబాకం నుండి తిరుపతిలో సీపీఐ జిల్లా కార్యాలయానికి తరలించారు. సాయంత్రం మూడు గంటల వరకు ప్రజల సందర్భనార్థం పార్థీవ దేహాన్ని వుంచారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యకర్తలు నాయకులు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్దఎత్తున చేరుకుని కడసారిగా పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం పార్థీవ దేహాన్ని మెడికల్‌ కాలేజీకి అప్పగించారు. వసుమతి దేవికి ప్రముఖుల నివాళి.. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, అనీ రాజా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వర రావు, పీ.హరినాథరెడ్డి అక్కినేని వనజ, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి పల్లా వెంకటరెడ్డి సురవరం విజయలక్ష్మీ, కఫిల్‌, రచయిత కేతు విశ్వనాథరెడ్డి , ఎ ఐ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు రావుల రవీంద్రనాథ్‌ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ఓబులేసు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు రావుల వెంకయ్య, జీ.ఈశ్వరయ్య, ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ పోరం జాతీయ నాయుకులు బుడ్డిగా జమీందార్‌, రాయల సీమ పశ్చిమ జిల్లాల ఎమ్మెల్సీ కత్తి నరసింహ రెడ్డి, ఐజెయూ అధ్యక్షులు కె.శ్రీనివాస రెడ్డి ఏపీయూడబ్ల్యూజె రాష్ట్ర అధ్యక్షలు ఐవీ సుబ్బారావు, ఎంఆర్‌పీఎస్‌ నేత మంద క్రిష్ణమాదిగ, యస్‌ టి యు నేత గాజుల నాగేశ్వర రావు, సీ ఆర్‌ ఫౌండేషన్‌ మెడికల్‌ ఆఫీసర్‌ రజనీ, చేతి వ ృత్తి దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ కందేరి జయచంద్రా నాయుడు , తమిళనాడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తురసు, పాండిచ్చేరి రాష్ట్ర కార్యదర్శి సలీం, తెల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే రామ చంద్రన్‌, లగుమయ్య, ఏలూరు సీపీఐ మాజీ ఎమ్మెల్యే లత , సీపీఐ సీనియర్‌ నాయకులు పార్థ సారథి, చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు, నెల్లూరు జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌ రామారాజు దామా అంకయ్య సీపీఐ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎం ఎల్‌ నారాయణ, అనంతపురం జిల్లా కార్యదర్శి జగదీష్‌, స్టేట్‌ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు చలసాని అజయ్‌ కుమార్‌, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్‌, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి అవుల శేఖర్‌, ఆర్‌ వెంకటరరావు, మాజీ ఎమ్మెల్యే యస్‌ సీ వి నాయుడు, చదలవాడ కృష్ణమూర్తి, సుగునమ్మ, ఎంఎల్‌సీ దొరబాబు, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, టీడీపీ నేతలు నరసింహయాదవ్‌, మబ్బుదేవనారాయణ రెడ్డి, మునిక్రిష్ణ, గోగినేని భాస్కర్‌ నాయుడు, శ్రీ సిటీ ఎం డి సన్నారెడ్డి రవిచంద్రారెడ్డి, రామలసీమ సమగ్రాభివృద్ధి అధ్యయనవేదిక కన్వీనర్‌ టి.లక్ష్మినారాయణ, సీపీఎం నాయకులు కందారపు మురళి, నాగరాజు, జనసేన పార్టీ నాయకులు కిరన్‌రాయల్‌, రాజారెడ్డి, ఎ ఐ ఎస్‌ ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి, ఎ ఐ వై ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌. లెనిన్‌ బాబు, విజయవాడ దోనేపూడి శంకర్‌, డిహెచ్‌పిఎస్‌ రాష్ట్ర నాయుకులు బుట్టి రాయప్ప తదితరలు నివాళలు అర్పించి, నారాయణను కుటుంబ సభ్యులను పరామర్శించారు. మెడికల్‌ కాలేజీకి వసుమతి దేవి పార్థివ దేహం.. కే.నారాయణ సతీమణి వసుమతి దేవి పార్థివ దేహాన్ని తిరుపతి మెడికల్‌ కాలేజీకి అప్పగించారు. బైరాగిపట్టెడ సీపీఐ కార్యాలయం నుండి పార్టీ కార్యకర్తలు వందలాది మంది ప్రదర్శనగా వెళ్ళి, వసుమతి దేవికి జోహార్లు అర్పిస్తూ పార్థీవ దేహాన్ని వైద్యులకు అప్పగించారు. గతంలో ఆయన తల్లి కంకణాల ఆది లక్ష్మి హైదరాబాద్‌ లో మ ృతి చెందగా గాంధీ మెడికల్‌ కాలేజీకి మృత దేహాన్ని ఇవ్వడం జరిగింది. మెడికల్‌ కాలేజీ విద్యార్థులకు ప్రయోగాల కోసం ఉపయోగ పడాలి అనే ఉద్దేశంతో ఇవ్వడం మంచి పరిణామం అని పలువురు అభినందించారు. ఆయన ఉద్యమాల్లో...ఆమె కుటుంబ బాధ్యతల్లో... పురుషులు జీవితకాలం కమ్యూనిస్ట్‌గా ఉండి, ప్రజా సమస్యలపై పనిచేస్తూ, ప్రజలతో మమేకమవుతూ మంచి కమ్యూనిస్టుగా పేరు ప్రతిష్టలు పొందుతారు. కుటుంబాలకు సైతం టైం ఇచ్చి పిల్లల పెంపకం లోనూ, కుటుంబం నిర్వహణలోనూ, ఆర్థిక ఇబ్బందులను పాలుపంచుకోలేని పరిస్థితి కూడా ఉండి ఉంటుంది. ఆ కుటుంబాలను వారి భార్యలు ఆ బాధ్యతలు తీసుకొని భర్తలు పూర్తికాలం కమ్యూనిస్టులుగా పని చేయడానికి ఎంతో సహకరిస్తారు. ఇటువంటి భార్యలు కమ్యూనిస్టు జీవితాలలో కోకొల్లలుగా ఉన్నారు. వారి కోవలో వసుమతి దేవి. చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగాను, ఆలిండియా కార్యదర్శిగాను కమ్యూనిస్టు పార్టీ సి పి ఐ లో పనిచేస్తున్న నారాయణ గారు అందరికీ సుపరిచితమే. విద్యార్థి దశ నుండి ఈనాటి వరకు భారత కమ్యూనిస్టు పార్టీని నడపడంలో, నడిపించడంలో ముందు ఉన్నటువంటి నాయకుడిగా అందరికీ తెలుసు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా తిరుపతి ప్రాంతంలో నారాయణ తెలియని వారు ఎవరూ ఉండరు. విద్యార్థి దశ నుండి ఆయన కమ్యూనిస్టు గా ఉన్నారు. ఆ విద్యార్థి ఉద్యమ నుండి వచ్చిన వసుమతి గారు నారాయణ గారిని వివాహమాడారు. ఎస్వీ యూనివర్సిటీలో ఎంఎస్సీ మ్యాథ్స్‌ చేస్తూ ఎఐఎస్‌ఎఫ్‌లో పని చేసినటువంటి వసుమతి వివాహానంతరం బ్యాంకు ఉద్యోగి గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ నారాయణ గారు పూర్తికాలం కార్యకర్తగా, కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడిగా నిలబడడానికి, నడవడానికి ఎంతో సహకరించిన వసుమతి దేవి 40 ఏళ్ల కుటుంబ జీవితంలో ఏ నాడు కనిపించని కమ్యూనిస్టుగా జీవితం గడిపారు. అగ్రికల్చర్‌ కోపరేటివ్‌ బ్యాంకు ఉద్యోగి గా, ఆ యూనియన్‌ లీడర్‌ గా మరియు శ్రామిక మహిళ యూనియన్‌ లీడర్‌ గా పనిచేశారు. పిల్లల బాధ్యతలు తీరి, ఉద్యోగ విరమణ పొంది చివరి దశలో భార్యాభర్తలు ఇద్దరూ కమ్యూనిస్టు జీవితంలోనే సొంత ఊరైన నగిరి మండలం అయినంబాకంలో ఇల్లు కట్టుకుని ఉండాలి అనుకున్నా కోరిక తీరకనే ఆమె పరమపదించారు. దిగ్భ్రాంతికి గురయ్యా...పార్టీకి తీరని లోటు గురువారం సాయంత్రం నాకు విషయం తెలియగానే చెన్నై నుండి హుటాహుటిన వచ్చాను. వసుమతి చనిపోవడం చాలా దిగ్భ్రాంతి కలిగించింది.ఆమె మరణం బాధాకరం. నారాయణ భార్యగానే కాకుండా వసుమతి పార్టీ సభ్యురాలు. కమ్యూనిస్టు ఉద్యమంలో విద్యార్థి రంగంలో మహిళ సంఘంలో బాధ్యతలు నిర్వహించడంతో పాటు చురుకుగా పనిచేశారు. మంచి ఆప్యాయత అనురాగాలు కలిగిన వ్యక్తి. పార్టీ అవసరాల రిత్యా నారాయణ డిల్లీకి రావాల్సి వచ్చింది. ఆయనతో పాటు డిల్లీకి వచ్చి ఆ వాతావరణ పరిస్థితులకు అలవాటుపడి నారాయణ పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నం కావడానికి ప్రోత్సహించిన వ్యక్తి. నాకు నారాయణతో దీర్ఘకాలిక అనుబంధం వుంది. విద్యార్థి యువజన ఉద్యమాల నుండి ఆయనతో సత్‌సంబందాలు వున్నాయి. అమె అకాల మరణం నారాయణకే కాకుండా కమ్యూనిస్టు పార్టీ శ్రేణలకు తీరని లోటు. సీపీఐ జాతీయ సమితి తరపున, మా కుటుంబం తరపున వసుమతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి తీవ్ర సానూభూతిని తెలియజేస్తున్నా.. డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి

పార్టీకి తీరనిలోటు...
నారాయణ సతీమణి వసుమతి దేవి మృతి బాధాకరం. బ్యాంకు ఉద్యోగిగా వుంటూ ఉద్యోగ సంఘం నాయకురాలిగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగ్గా పాల్గొనేవారు. స్వచ్చంద పదవీ విరమణ చేసిన అనంతరం పార్టీ కార్యక్రమాల్లో అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. నారాయణకు పార్టీ కార్యక్రమాలకు అన్ని విధాల సహకరించే వారు. ఇటు కుటుంబ బాధ్యతలను, అటు పార్టీ పరమైన కార్యక్రమాలను తనదైన శైలిలో నిర్వహించారు. ఆమె ఆకస్మిక మృతి పార్టీకే కాకుండా నారాయణ కుటుంబానికి కూడా తీరని లోటు. ఈ విషమ పరిస్థితి నుండి నారాయణ కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా..
    `కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

కార్యకర్తలను కలిచివేసింది
వసుమతి దేవి మృతితో పార్టీ క్యాడర్‌ మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. బాగా ఆరోగ్యంగా అందరితో కలివిడిగా మాట్లాడతూ తిరిగే అమె ఆకస్మికంగా మృతి చెందడం జీర్ణించుకోలేకపోతున్నాం. నారాయణ కుటుంబంతో పాటు పార్టీలోని అనేక మంది నాయకులు, కార్యకర్తలతో మమేకమయ్యేవారు. అలాంటి వసుమతి దేవి మృతి చెందడం పార్టీలోని ప్రతి కార్యకర్తను కలిచివేసింది. నారాయణ కుటుంబానికి ప్రగాడ సానూభూతిని వ్యక్తం చేస్తున్నా.
`ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి

నారాయణ ఎదుగుదల వెనక వసుమతి
వసుమతి దేవి మరణవార్త రాష్ట్రంలోని కమ్యూనిస్టు శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మూడు రోజుల క్రితం ఆరోగ్యంగా వుంది. వసుమతికి కొండంత సహనం, వినయం వున్న వ్యక్తి. నారాయణ రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు నాయకత్వంలో ఎదగడానికి..ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించడానికి వసుమతి ప్రోత్సాహం ఎంతో వుంది. ఆమె లేని లోటు పార్టీకి కూడా తీరని నష్టం. ఈ లోటును పూడ్చలేక పోయినప్పటికి, ఈ విషాదం నుండి నారాయణ త్వరగా కోలుకోవాలి, కుమారుడు, కుమార్తె దైర్యంగా వుండాలి.
`జి.ఓబులేసు, ఏఐటియూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

విజయసాయి రెడ్డి నివాళి
వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి శుక్రవారం సాయంత్రం సిపిఐ కార్యాలయానికి చేరుకుని వసుమతి దేవి పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారాయణతో ఆయన మాట్లాడతూ ధైర్యంగా వుండాలని సూచించారు. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా పాల్గొని వసమతికి నివాళులు అర్పించారు. ప్రముఖ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్‌ వసుమతిదేవి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img