Friday, April 19, 2024
Friday, April 19, 2024

వస్త్రధారణ పేరుతో మహిళలను వేధించడం ఆపాలి : ప్రియాంకగాంధీ

వస్త్రధారణ పేరుతో మహిళలను వేధించడం ఆపాలని ఒక ట్వీట్‌లో కాంగ్రెస్‌ నేత ప్రియాంకగాంధీ పేర్కొన్నారు. హిజాబ్‌ ధరించి కళాశాలకు వచ్చారనే కారణంగా తరగతి గదులకు అనుమతించకపోవడంతో కోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులకు ప్రియాంక గాంధీ వాద్రా బాసటగా నిలిచారు. తాము ఎలాంటి దుస్తులు ధరించుకోవాలో నిర్ణయించుకోవడం మహిళల హక్కు అని, ఆ హక్కుకు భారత రాజ్యంగం హామీ ఇస్తోందని అని పేర్కొన్నారు. బికినీ వేసుకోవాలా, చీరకొంగుతో ముసుగు వేసుకోవాలా, జీన్స్‌ ధరించాలా అనేది ఆమె ఇష్టాన్ని బట్టే ఉంటుందని పేర్కొన్నారు. ‘లడ్‌కీహూ లడ్‌సక్‌తీ హూ’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img