Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వానలే.. వానలు

స్తంభించిన జనజీవనం
పొంగుతున్న వాగులు,వంకలు
చెరువులను తలపించిన వీధులు
అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం జగన్‌
అన్ని జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిరది. పట్టణాల్లో వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ గుంటలున్నాయో తెలియక వాహనదారులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక జిల్లాల్లో ప్రయాణీకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారమైతే గంట కూడా గ్యాప్‌ ఇవ్వలేదు. దీంతో జనజీవనం పూర్తిగా స్థంభించింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిరది. పట్టణాల్లో వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ గుంటలున్నాయో తెలియక వాహనదారులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. అనేక జిల్లాల్లో ప్రయాణీకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పులిచింతల దిగువన ఉన్న వైరా ఏరు, కట్టలేరు, మునేరులకు భారీగా వరద వస్తోంది. దీంతో కృష్ణానదికి ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదకర ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ కలెక్టర్లను ఆదేశించారు. ఇవాళ కాపునేస్తం పథకంలో భాగంగా నిధుల బదిలీని వర్చువల్‌ విధానంలో ప్రారంభించిన సీఎం జగన్‌ అనంతరం కలెక్టర్లతో మాట్లాడారు. వివిధ జిల్లాల్లో తాజా పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. భారీవర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్ధాయిలో పరిస్ధితుల్ని సమీక్షించాలని జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను సీఎం జగన్‌ ఆదేశించారు. వర్షాల కారణంగా ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల నుంచి జనాన్ని ముందుగానే అక్కడి నుంచి తరలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రాజెక్టుల్లో నీటి మట్టాల్ని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు మున్సిపల్‌ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ కూడా భారీ వర్షాలపై ప్రత్యేక సమీక్ష చేశారు. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో అధికారు లంతా అందుబాటులో ఉండాలని, ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే సహాయక చర్యల్లో వార్డు,సచివాలయ ఉద్యోగులను కూడా భాగస్వాములను చేయాలని కమిషనర్లను ఆదేశించారు. మరోవైపు ఎడతెరపిలేని వర్షాలతో అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img