Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వాయు కాలుష్యానికి రైతుల్ని నిందించొద్దు : తికైత్‌

ఘజియాబాద్‌ : దిల్లీలో వాయు కాలుష్యానికి రైతులు పంట దుబ్బులు తగలబెట్టడం కారణం కాదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేష్‌ తికైత్‌ అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు పరిశీలనను ఉటంకిస్తూ.. కాలుష్య బాధలకు రైతు సమాజాన్ని బాధ్యులను చేస్తున్న వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘దుబ్బులు తగులబెట్టడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతోందంటూ రైతులను విలన్‌లుగా అభివర్ణించే వారు రైతులకు క్షమాపణలు చెప్పాలి.. రైతులను బాధ్యులను చేయడం సరికాదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది.. ఎందుకంటే కేవలం 10 శాతం కాలుష్యం మాత్రమే దీనివల్ల వస్తుంది.. అది కూడా ఒకటిన్నర నుంచి రెండు నెలలు మాత్రమే’ అని తికైత్‌ మంగళవారం హిందీలో ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img