Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వారిపై ప్రతీకారం తీర్చుకుంటాం : జో బైడెన్‌

అఫ్ఘానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో జరిగిన పేలుళ్లకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. దాడుల్లో మృతిచెందిన సైనికులను హీరోలుగా ఆయన అభివర్ణించారు. ‘‘ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు అమెరికా.. తన ప్రాణాలను ఫణంగా పెట్టింది. అఫ్ఘానిస్థాన్‌ నుంచి అమెరికా పౌరులను తరలిస్తాం.. మా మిషన్‌ కొనసాగుతుంది. కాబూల్‌ దాడి వెనక తాలిబన్లు, ఐసిస్‌ కుట్ర ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు’ అని జో బైడెన్‌ ప్రకటించారు.ఈనెల 31 నాటికి తమ బలగాలను ఉపసంహరించుకుంటామని, కాబుల్‌ పేలుళ్ల ఘటనలో కనీసం 72 మంది మృతి చెందారు. వారిలో 12 మంది అమెరికా సైనికులు ఉన్నారని చెప్పారు. కాగా దాడికి పాల్పడిరది తామేనని ఇప్పటికే ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆ ఉగ్రవాద సంస్థ నాయకులను హతమార్చాలని తమ దేశ సైన్యాన్ని బైడెన్‌ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img