Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

వాస్తవాలకు నిలువుటద్దం

మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: అమరావతి రాజధాని ధ్వంసమే వైసీపీ ధ్యేయంగా ఉందని, పదే పదే రాజధాని అంశంపై వివాదాలు సృష్టిస్తు న్నదని, మంత్రి ధర్మాన ప్రసాదరావు… వైసీపీ రాష్ట్ర ప్రజానీకానికి చేస్తున్న ద్రోహాన్ని పదే పదే వెళ్లగక్కడమే అందుకు నిదర్శనమని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆ పార్టీ ఇంటికెళ్లక తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ… ఎవరేమ నుకున్నా డిసెంబరులో విశాఖ నుంచి పాలన ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోమారు స్పష్టం చేశారనీ, ధర్మాన పదేపదే వాస్తవాలు వెల్లడిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. మూడు రాజధానులనే బూటకపు మాటలతో వైసీపీ రాష్ట్ర ప్రజలను ఇన్నాళ్లూ మభ్యపెట్టిందనేది ధర్మాన వ్యాఖ్యలతో బహిర్గతమవుతోందని పేర్కొన్నారు. అమరావతి రాజధానిని ధ్వంసం చేయాలని, అక్కడ అభివృద్ధి లేకుండా చేయాలని, విశాఖకు రాజధాని తరలింపునకు జగన్‌ ప్రయత్నిస్తున్నారంటూ సీపీఐ మొదటి నుంచి స్పష్టం చేస్తూనే ఉందని పేర్కొన్నారు. నేరుగా ఏపీ రాజధానిని విశాఖపట్నానికి మారుస్తున్నామని చెప్పే దమ్మూ, ధైర్యం లేక డొంకతిరుగుడుగా జగన్‌ మూడు రాజధానులంటూ కుట్రపూరితంగా వ్యవహరించారని, జనంలో గందరగోళానికి తెరలేపారని విమర్శించారు. హైకోర్టు కర్నూలులో పెట్టాలని రాజకీయ పక్షాలూ చెప్పాయని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా చెప్పినప్పటికీ కర్నూలులో ఇప్పటివరకు ఎందుకు హైకోర్టు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది కూడా ధర్మానే అంగీకరించారన్నారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాష్ట్రాభివృద్ధి కావాలని కోరుకునే అందరూ జగన్‌ను ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి అటకెక్కిందని, వ్యవసాయ, ఇరిగేషన్‌, పారిశ్రామిక రంగాలన్నీ కుంటుపడ్డాయని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీల అమలు కోసం కేంద్రంతో పోరాడిరదీ లేదనీ, కేవలం మోదీ, అమిత్‌ షాకు దాసోహమంటూ రాష్ట్రాభివృద్ధిని కేంద్రానికి తాకట్టు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిరచారు. సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర రాజధాని విషయంలో తన స్పష్టమైన వైఖరిని బయటపెట్టాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img