Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

విద్యాసంస్థల రాష్ట్ర బంద్‌..రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు

విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ … కేజీ నుంచి పీజీ వరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల ఎదుట విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ,జగన్‌ ప్రభుత్వం తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చామన్నారు.సీఎం జగన్మోహన్‌ రెడ్డి తన పాదయాత్ర సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగాన్ని పరిరక్షిస్తామని, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగా చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తుంటే… జగన్మోహన్‌ రెడ్డి తమపై ఉన్న కేసుల భయంతో ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారని, జీవో నెంబర్‌ 84, 85, 117 తీసుకొచ్చి 3, 4, 5 తరగతులను హైస్కూల్లో కలపడం వల్ల రాష్ట్రంలో సుమారు పదివేల పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొందని ఆవేదన చెందారు. విద్యా రంగంలో సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.
విజయవాడ
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు వామపక్ష విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తి విద్యాసంస్థలు బంద్‌ కు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా విజయవాడ బి.ఎస్‌.ఆర్‌ కె నగరపాలక సంస్థ పాఠశాల దగ్గర ఆందోళన చేసిన 16 మంది విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేసి విజయవాడ మాచవరం పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.
విజయనగరం జిల్లా
విద్యార్థులపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. విద్యార్ది సంఘాల ఇచ్చిన బంద్‌ లో బాగంగా స్థానిక కష్పా హై స్కూల్‌ వద్ద శాంతి యుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్ది సంఘాల నాయకులు పై పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న విద్యార్ది సంఘాల నాయకులును బలవంతంగా ఈడ్చుకెల్లి అరెస్టులు చేయడంతో పాటు ప్రతిఘటించిన విద్యార్ది నాయకులపై ఒకటవ పట్టణ ఎస్‌ ఐ విజయకుమార్‌ పిడి గుద్దులతో విరుచుకుపడ్డారు.
కాకినాడ
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఏ, పీడిఎస్‌ యు తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది. కాకినాడ జిల్లా కేంద్రంలో పలు విద్యాసంస్థలకు ముందస్తుగా బందు నోటీసులను ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img