Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

వినాశకర రక్షణ ఆర్డినెన్స్‌ రద్దు

ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణకు కార్మిక సంఘాల ఐక్య వేదిక డిమాండు
దేశవ్యాప్తంగా ఆందోళనల్లో పాల్గొన్న లక్షలాది కార్మికులు
9 నుంచి సేవ్‌ ఇండియా ఉద్యమం

న్యూదిల్లీ :
రక్షణ రంగ కార్మికుల సమ్మె హక్కును హరించే విధంగా వారిలో అభద్రతా భావం కల్పించే విధంగా తీసుకు వచ్చిన వినాశకర రక్షణ ఆర్డినెన్స్‌ను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాల (సీటీయూలు) ఐక్యవేదిక డిమాండు చేసింది. అదే సమయంలో రక్షణ ఉత్పత్తి రంగాన్ని ప్రైవేటుకు అప్పగించే నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేనిపక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించింది. విశాశనకర అత్యవసర రక్షణ సేవల ఆర్డినెన్స్‌, రక్షణ ఉత్పత్తి రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక యూనియన్ల ఐక్య పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన దేశవ్యాప్త ఆందోళన విజయవం తమైంది. లక్షలాది మంది కార్మికులు పాల్గొని ర్యాలీలు, ధర్నాలతో తమ నిరసనను వ్యక్తంచేశారు. రాక్షస ఆర్డినెన్స్‌లపై ఐక్యపోరునకు సీటీయూలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వే, గనులు, ఆర్థిక రంగం ఇలా వరుస పెట్టి అన్నింటిని ప్రైవేటుకు దారాదత్తం చేస్తున్న మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాల్సిందేనని నేతలు ఉద్ఘాటించారు. వినాశకర ప్రజాకార్మిక వ్యతిరేక చర్యలు, చట్టాలను ముక్తకంఠంతో తిరస్కరించాలన్నారు. విదేశీ దేశీయ బడా కార్పొరేట్ల మెప్పు కోసమే దేశాన్ని కేంద్ర సర్కార్‌ తాకట్టు పెట్టేస్తోందని దుయ్యబట్టారు. దిల్లీ ట్రేడ్‌ యూనియన్ల ఆధ్వర్యంలో పార్లమెంటు స్ట్రీట్‌ వద్ద నిరసనలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌, సీఐటీయూ ప్రధాన కార్యదర్వి తపన్‌ సేన్‌Ñ ఏఐసీసీటీయూ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ దిమిరి, హెచ్‌ఎంఎస్‌ మేనేజర్‌ నారాయణ్‌ సింట్‌, ఏఐయూటీయూ నేత చౌరసియాÑ యూటీ యూసీ నేత ఆర్‌ఎస్‌ దాగర్‌, ఎస్‌ఈడబ్ల్యూఏ నేత ఉషా, ఎంఈసీ నేత సంతోష్‌ కుమార్‌, ఐసీటీయూ నేత శ్రీనాథ్‌తో పాటు కార్మిక నేతలు సంతోష్‌ రాయ్‌, శత్రుజిత్‌ సింగ్‌, రామ్‌రాజ్‌, ధీరేంద్ర శర్మ, అనురాగ్‌ తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాలు, ఆప్‌ కార్మిక సంఘం నేతలు, కార్యకర్తలు మద్దతు ప్రకటించారు. వినాశకర రక్షణ ఆర్డినెన్స్‌ రద్దునకు ఐక్యంగా డిమాండు చేశారు. రాబోయే రోజుల్లో కార్మిక సంఘాల పోరు మరింత ఉధృతం కానున్నట్లు నాయకులు తేల్చిచెప్పారు. ఆగస్టు 9న ‘సేవ్‌ ఇండియా’ పక్ష రోజుల ఉద్యమాన్ని నిర్వహి స్తామని ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, ఏఐయూటీ యూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్‌పీఎఫ్‌, యూటీ యూసీతో పాటు స్వతంత్ర సంఘాలు / సమాఖ్యల ఐక్యవేదిక ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img