Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విపక్ష సభ్యులపై సభా హక్కుల కమిటీ దర్యాప్తు – ఆదేశాలు వెనక్కి

. తక్షణమే అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
. సీపీఐ ఎంపీ వినయ్‌ విశ్వం డిమాండ్‌
. రాజ్యసభ చైర్మన్‌ ధన్కర్‌కు లేఖ

న్యూదిల్లీ: సభలో గందరగోళం సృష్టించారన్న నెపంతో 12 మంది విపక్ష సభ్యులపై దర్యాప్తునకు రాజ్యసభ చైర్మన్‌ ధన్కర్‌ ఆదేశాలివ్వడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వారసత్వానికి విరుద్ధమని సీపీఐ ఎంపీ వినయ్‌ విశ్వం అన్నారు. పార్లమెంటు నిబంధనావళి ప్రకారం తనకున్న హక్కును సభ్యుడు చట్టసభలో వినియోగిస్తే అది ‘పార్లమెంటరీ ప్రివిలేజ్‌’ని అతిక్రమించడం ఎలా అవుతుందని గురువారం ధన్కర్‌కు రాసిన లేఖలో విశ్వం ప్రశ్నించారు. సభా మర్యాదకు విఘాతం నెపంతో 12 మంది విపక్ష సభ్యులు (9 మంది కాంగ్రెస్‌, ముగ్గురు ఆప్‌ నేతలు)పై పార్లమెంటరీ కమిటీకి ఆదేశాలివ్వడాన్ని తీవ్రంగా ఖండిరచారు. ఈ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని,ఈ సమస్య పరిష్కారానికి మార్గాలు కనుగొనేందుకు అఖిపక్ష సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. సభ్యులపై సభాహక్కుల కమిటీకి నివేదించడం అనవసరమైన చర్యగా పేర్కొన్నారు. పార్లమెంటులో ఒక్క అంశంపైనా చర్చ జరగనివ్వడం లేదని ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడం ఆందోళనకలిగించే అంశమని, ప్రజాస్వామ్యంలో పార్లమెంటు అంటే చర్చలు జరపడమేనని విశ్వం వెల్లడిరచారు. విపక్ష ఎంపీలపై సభాహక్కుల కమిటీ విచారణకు ధన్కర్‌ ఆదేశాలివ్వడం పార్లమెంట్‌ ‘ప్రజాస్వామ్య వారసత్వం’కు వ్యతిరేకమని తాను బలంగా నమ్ముతున్నట్లు సీపీఐ ఎంపీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌, ఆప్‌ ఎంపీలు సభ కార్యకలాపాలకు విఘాతం కలిగించారని, పదేపదే వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారని, తద్వార సభ మర్యాదకు విఘాతం కలిగిందని, దీనిపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని ధన్కర్‌ ఇటీవలి ఆదేశాలిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img