Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

విమర్శిస్తే సమన్లు తప్పవ్‌!

. అమిత్‌ షాపై రాసిన వ్యాసానికి జాన్‌ బ్రిట్టాస్‌కు రాజ్యసభ చైర్మన్‌ నోటీసులు
. రాతపూర్వక వివరణ కోరిన ఎగువసభ
. సానుకూల స్పందనపై కేరళ ఎంపీ ఆశలు

న్యూదిల్లీ: సాధారణంగా ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ, వాక్‌ స్వేచ్ఛ ఉంటాయి. ప్రభుత్వాలను విశ్లేషించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మన దేశంలో ప్రజాస్వామ్యం కేవలం నామమాత్రంగా తయారవుతోంది. నిరంకుశత్వం పెరిగిపోతోంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహులంటారు. విశ్లేషకులనూ ఉపేక్షించబోరు. తాజాగా ఇటువంటిదే జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల కర్నాటకలో చేసిన వ్యాఖ్యలపై విశ్లేషణాత్మక వ్యాసాన్ని సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ రాశారు. దానిని ఓ ప్రముఖ వార్తాపత్రిక ముద్రించింది. ఇప్పుడు దానిపై రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్కర్‌ నుంచి ఎంపీకి సమన్లు జారీ అయ్యాయి. అమిత్‌ షాపై చేసిన వ్యాఖ్యల మీద వివరణను మౌఖికంగా కాకుండా రాతపూర్వకంగా ఇవ్వాలని రాజ్యసభ వర్గాలు సూచించాయి. తొలుత రాజ్యసభ సెక్రటేరియట్‌ నోటీసు జారీ కాగా చైర్మన్‌ వద్దకు వెళ్లి మౌఖికంగా ఈ అంశం గురించి ఎంపీ వివరణ ఇచ్చారు. ఆపై రాపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆయనను సూచించినట్లు తెలిసింది.
ఎన్నికలు జరగబోయే కర్నాటకలో ప్రసంగిస్తూ కేరళను తక్కువ చేసి అమిత్‌షా మాట్లాడినట్లు ఎంపీ బ్రిట్టాస్‌ ఆరోపించారు. ప్రముఖ ఆంగ్ల పత్రికలో బ్రిట్టాస్‌ వ్యాసం ‘పెరిల్స్‌ ఆఫ్‌ ప్రాపగాండా’ను ఫిబ్రవరి 20న ప్రచురించారు. కర్నాటకను బీజేపీ మాత్రమే సురక్షితంగా ఉంచగలదని, పక్కనే కేరళ ఉన్నదని, కాంగ్రెస్‌ను కాకుండా తమ పార్టీనే ఎన్నుకోవాలని అమిత్‌షా చెప్పడాన్ని బ్రిట్టాస్‌ ఖండిరచారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ‘కర్నాటకలో కేరళను తక్కువ చేస్తూ అమిత్‌షా మాట్లాడటం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. కేవలం ఆయన పార్టీనే కర్నాటకను సురక్షితంగా ఉంచగలదని, పక్కనే కేరళ ఉన్నదని ఏదో హెచ్చరించేలా మాట్లాడారు. దీని గురించి ఎక్కువగా మాట్లాడనుగానీ ఈ విధంగా మాట్లాడటం బీజేపీ వారికి కొత్తేమీ కాదు. తమ ఆధిపత్య రాజకీయాలను తిరస్కరించిన రాష్ట్రం… దేశంలోనే అత్యధిక అక్షరాస్యతగల రాష్ట్రమైన కేరళను బీజేసీ సీనియర్లు అనేకమంది విమర్శిస్తున్నారు’ అని బ్రిట్టాస్‌ పేర్కొన్నారు. ఈ వ్యాసంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తంచేసింది. దీనిపై రాజ్యసభ సెక్రటేరియట్‌, చైర్మన్‌ ధన్కర్‌కు బీజేపీ కేరళ శాఖ ప్రధాన కార్యదర్శి పి.సుధీర్‌ ఫిర్యాదు చేశారు. బ్రిట్టాస్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాసంలో ‘దేశద్రోహ’ వైఖరి కనిపిస్తోందని పేర్కొన్నారు. తాజా పరిణామాలు తనను షాక్‌కు గురిచేసినట్లు మరొక పత్రికతో మాట్లాడిన బ్రిట్టాస్‌ తెలిపారు. ఓ వ్యాసం గురించి పాలక పక్షం ఫిర్యాదు చేయడం, దానిపై స్పందించి చర్చ కోసం రాజ్యసభ చైర్మన్‌ పిలవ డంతో ఖంగు తిన్నానన్నారు. తన పక్షాన్ని చైర్మన్‌ ముందుర ఉంచగా ఆయన అభినందించారని అన్నారు. ‘హోంమంత్రి చేసిన ఆరోపణలపై స్పందిం చానంతే. అందులో తప్పేమీ లేదు. ప్రముఖ పత్రిక దానిని ప్రచురించింది. అది నా భావ ప్రకటన`వాక్‌ స్వేచ్ఛ పరిధిలోనే జరిగింది’ అని ఎంపీ తెలి పారు. ఫిర్యాదు చేసిన వ్యక్తికి సరైన సమాధానాన్ని చైర్మన్‌ ఇస్తారని ఆకాంక్షిస్తు న్నట్లు తెలిపారు. ‘చైర్మన్‌ విజ్ఞులు. ప్రాథమిక హక్కుల గురించి తెలిసిన వ్యక్తి. నా హక్కులను పరిరక్షిస్తారన్న నమ్మకం ఉంది’ అని బ్రిట్టాస్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img