Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

విమాన చక్రాల్లో మానవ అవశేషాలు : అమెరికా

కాబూల్‌ విమానాశ్రయంలో అమెరికా వైమానికదళ కార్గో విమానం ఎక్కేందుకు పరుగులు, తోపులాటలు, రెక్కలు పట్టుకొని ప్రయాణం వంటి హృదయవిదారక దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించింది. విమానంలో సీటు దొరక్క రెక్కలు, చక్రాలు పట్టుకుని వేలాడుతూ జారిపడిన ఆ దృశ్యాలు అందర్నీ కలిచివేశాయి. తాజాగా విమాన చక్రాల్లో మానవ అవశేషాలు కనిపించినట్లు వైమానిక దళం ఓ ప్రకటనలో తెలిపింది. కాబూల్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరిన సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ సైనిక విమానం మంగళవారం ఖతార్‌లోని ఆల్‌ ఉబెయిద్‌ ఎయిర్‌బేస్‌లో దిగింది. అక్కడ విమానాన్ని పరిశీలిస్తుండగా చక్రం భాగాల్లో మనవ మానవ శరీరభాగాలు గుర్తించారు. అయితే సైనిక విమానం కాబూల్‌లో ల్యాండైన కొన్ని క్షణాల్లోనే వందలాది మంది వచ్చి ఎలా దాన్ని ఆక్రమించారో తెలియదని అమెరికా తన ప్రకటనలో పేర్కొంది. సరుకును దించకముందే.. ఆ విమానాన్ని వందలాది మంది చుట్టుముట్టారని అధికారులు తెలిపారు. ఎలాగైన దేశం విడిచి వెళ్ళాలన్న తొందరలో కొందరు చక్రాలను పట్టుకుని ప్రయాణించారు. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత చక్రాల్లోకి ఇరుక్కొని ఉంటారని అనుమానిస్తున్నారు. . ఎంత మంది మృతిచెందారన్న విషయాన్ని స్పష్టం చేయలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img