Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

విమాన టికెట్ల ధరలు..అధికారిక వెబ్‌సైట్లలో..

ప్రయాణికులకు డీజీసీఏ కీలక సూచనలు
అంతర్జాతీయ ప్రయాణికులకు డీజీసీఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్స్‌) పలు కీలక సూచనలు చేసింది. విమాన టికెట్‌ ధరల కోసం ప్రయాణికులు నేరుగా విమానయాన వెబ్‌సైట్లలోనే చూసుకోవాలని సూచించింది. బ్రిటన్‌లో కళాశాలల అడ్మిషన్‌ సీజన్‌ కావడంతో లండన్‌కు వెళ్లే విమాన టికెట్ల ధరలను సంబంధిత విమానయాన సంస్థలు భారీగా పెంచేశాయంటూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ మేరకు సూచనలు చేసింది. దిల్లీ-లండన్‌ మార్గంలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ టికెట్‌ ధర ఆగస్టు 26వ తేదీకి రూ.3.95 లక్షలు పలుకుతోందని కేంద్ర హోంశాఖ ఇంటర్‌స్టేట్‌ కౌన్సిల్‌ సెక్రెటేరియట్‌ సెక్రెటరీ సంజీవ్‌ గుప్తా ఇటీవల ట్వీట్‌ చేశారు. దీనిపై పౌరవిమానయాన శాఖ స్పందిస్తూ.. ఆగస్టు నెలలో దిల్లీ-లండన్‌ మధ్య ఎకానమి క్లాస్‌ టికెట్‌ ధర రూ. 1.03లక్షల నుంచి రూ. 1.47లక్షలు మాత్రమే ఉంటుందని పేర్కొంది. అయితే గూగుల్‌ వంటి మెటా సెర్చ్‌ ఇంజిన్లలో ఒక్కోసారి ఎయిర్‌లైన్‌ వెబ్‌సైట్లలో ఉండే ధరల కంటే ఎక్కువ ధరలు చూపిస్తున్నాయని, దీంతో గందరగోళ సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img