Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వివేకా హత్య కేసులో కీలక మలుపు.. ఏ1 ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే 5వ తేదీ లోపల సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డిని హైకోర్టు ఆదేశించింది. గంగిరెడ్డి బయట ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. వివేకా హత్య కేసు కీలక దశలో ఉందని… గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసింది. 5వ తేదీ లోపల సీబీఐ కోర్టు ఎదుట గంగిరెడ్డి లొంగిపోకపోతే… ఆయనను అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img