Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విశాఖే రాజధాని

. ఇక్కడి నుంచే పాలన చేస్తా
. పెట్టుబడిదారుల సదస్సులో సీఎం జగన్‌ పునరుద్ఘాటన

విశాలాంధ్రబ్యూరో-విశాఖపట్నం: దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్‌ కీలకంగా మారిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని, దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం గల రాష్ట్రం మనదేనన్నారు. శుక్రవారం ఉదయం విశాఖలో ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ మైదానంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమిట్‌ను పారిశ్రామికవేత్తలతో కలిసి సీఎం జగన్‌ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 20 కీలక రంగాల్లో ఆరు లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశాలు ఉన్నాయని, అందులో భాగంగా తొలి రోజు వివిధ సంస్థలతో 92 ఒప్పందాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో ఆరు పోర్టులు ఉన్నాయని, మరో నాలుగు పోర్టులు రాబోతున్నాయని, పోర్టుల సమీపంలో భూములు అందుబాటులో ఉన్నాయన్నారు. నైపుణ్యం గల యువత అందుబాటులో ఉందన్నారు. త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని జగన్‌ పునరుద్ఘాటించారు. ఏపీలో క్రియాశీలక ప్రభుత్వం ఉందని, విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతుందని, తాను కూడా విశాఖ నుంచే పరిపాలన చేయబోతున్నానని చెప్పారు. త్వరలోనే ఇది సాకారమవుతుందని జగన్‌ వెల్లడిరచారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని, రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయని, భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలమన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img