Friday, April 19, 2024
Friday, April 19, 2024

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉదృత పోరాటం !

రైల్ రోకో లు, కలెక్టరేట్ ల ముట్టడి

జగన్, బాబు కేంద్రం పై పోరాటానికి నాయకత్వం వహించాలి !

తిరుపతి ట్రేడ్ యూనియన్ల సంఘీభావ సదస్సులో ఎ ఐ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు .

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఉధృతమైన పోరాటాలకు సిద్ధం కావాలని ఎ ఐ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ల ముట్టడి, రైలు రోకో లకు సిద్ధం కావాలన్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాటానికి 500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి సీపీఐ కార్యాలయం లో సాంబ, సుబ్రమణ్యం అధ్యక్షతన రాయలసీమ ప్రాంతీయ సదస్సు జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జి.ఓబులేసు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం నాడు కమ్యూనిస్టు పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు రాజీనామా చేశారని అన్నారు. 2000 నుండి 2014 వరకు శర వేగంగా అభివృద్ధి జరిగింది అన్నారు. లేని నష్టాలు చూపి విశాఖ ఉక్కు పరిశ్రమ ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామని కేంద్రం చెప్పడం సిగ్గు చేటు అన్నారు. వ్యూహాత్మక పెట్టుబడులు అనే పేర్లు పెట్టి మోడీ దేశ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు . అధికారం చేపట్టిన ప్రతి ప్రధాని ప్రభుత్వ సంస్థల్ని నిర్మించారనీ, మోడీ ఒక్క ప్రభుత్వం మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించ లేదు అన్నారు. వున్న వాటిని ప్రైవేట్ వ్యక్తుల కు అప్పగిస్తున్నారు , పరిశ్రమల ఉద్దీపన పథకం ఏమైందని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కి ఎందుకు కేటాయించలేదు అని ప్రశ్నించారు. 22 సంఘాలు విశాఖ ఉక్కు పరిశ్రమ ను కాపాడుకోవాలని ఏకతాటి పై పోరాడుతున్నారని అన్నారు. అత్యధిక పార్లమెంటు సీట్లు వున్న జగన్ కేంద్రం పై పోరాడేందుకు నాయకత్వం వహించాలని సూచించారు .

సీఐటీయూ జిల్లా కోశాధికారి బాల సుబ్రమణ్యం మాట్లాడుతూ అన్నీ ట్రేడ్ యూనియన్ లు 500 రోజులు పోరాటం చేస్తుంటే కచ్చితంగా అమ్మివెస్తాం అని నిర్మలా సీతారామన్ చెప్పడం శోచనీయం అన్నారు.

వై ఎస్ ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ . రాజారెడ్డి మాట్లాడుతూ బి జే పీ అధికారం లోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ ఉందని విమర్శించారు. దీంతో వేలాది మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం వైసిపి కట్టుబడి ఉందని తెలిపారు. టి ఎన్ టి యు సి రాష్ట్ర కార్యదర్శి సిందుజ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పై అన్నీ పార్టీలు పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ను పోస్కో కంపెనీకి అమ్మివేస్తున్న మోడీ స్యదేశి విధానం అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర పతి అభ్యర్థి గా దళితుల్ని పెడుతున్నామని చెప్పి, పరిశ్రమలను ప్రైవేట్ పరం చేసి రిజర్వేషన్ లను కాలరాస్తున్నరని విమర్శించారు. ఈ సమావేశం లో ఏఐటియుసి చిత్తూరు జిల్లా కార్యదర్శి మురళి, రామచంద్రయ్య, నాగరజన్, నాగ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు . ఈ సమావేశం కు ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి కళాకారులు ఉద్యమ గీతాలు ఆలపించారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img