Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విశాఖ ఉక్కు రక్షణకు కదిలిన ఎర్ర దండు

ఎర్ర జెండాలు చేతబూని సీపీిఐ భారీ పాదయాత్ర
మోదీ కబంధ హస్తాల నుంచి దేశాన్ని కాపాడుకుంటాం
రాజమహేంద్రవరం సభలో సీపీిఐ రాష్ట్ర నేతలు

విశాలాంధ్ర `రాజమహేంద్రవరం : ప్రజా, ఉద్యోగ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలవలంబిస్తూ ప్రజా కంఠక పాలన చేస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గద్దె దింపడం ఖాయమని సీపీిఐ రాష్ట్ర నాయకులు ఉద్ఘాటించారు. విశాఖ ఉక్కును కాపాడుకొ ందాం… 27న భారత్‌ బంద్‌ను జయప్రదం చేద్దామంటూ సీపీిఐ జన ఆందోళన్‌ పిలుపులో భాగంగా శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సీపీఐ కార్యాలయం నుంచి వందలాదిమంది ఎర్ర జెండాలు చేతబూని… గిరిజన రేలా రేలా… ప్రజా నాట్యమండలి కళారూ పాలతో ప్రారంభమైన ప్రదర్శన మెయిన్‌రోడ్‌, లక్ష్మివారపు పేట, దేవీచౌక్‌ మీదుగా కంబాలచెరువు, గాంధీబొమ్మ సెంటర్‌కు చేరుకుంది. దేవీచౌక్‌ సమీపంలో రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాదయాత్రకు స్వాగతం పలికి పాదయాత్రలో భాగస్వాములయ్యారు. బహిరంగ సభ వద్ద మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. మెయిన్‌రోడ్డులో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ, నల్లమందు సందు సెంటర్‌లో జట్లు లేబర్‌ యూనియన్‌ నాయకులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. దారిపొడవునా ప్రజలు పూలవర్షం కురిపించారు. అనంతరం కంబాలచెరువు గాంధీబొమ్మ సెంటర్లో జరిగిన బహిరంగ సభకు సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షత వహించారు. నగర కార్యదర్శి నల్లా రామారావు నాయకులను వేదిక పైకి ఆహ్వానించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ముక్కలు ముక్కలు చేసి అమ్మి తీరుతామని మోదీ సర్కార్‌ చెబుతోందనీ, పోలవరంకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నరేంద్రమోదీ ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. స్వాతంత్య్రానంతరం దేశం సమకూర్చుకున్న లక్షల కోట్ల జాతీయ సంపదలను అంబానీ, ఆదానీలకు మోదీ ప్రభుత్వం కట్టబెడుతోందని విమర్శించారు. రైతుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపుమేరకు ఈ నెల 27న భారత్‌ బంద్‌ జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ, కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం ద్వారా ఉద్యోగులు, కార్మికులను నడిరోడ్డుమీదకు తెచ్చే ప్రయత్నాలను అంగీకరించబోమన్నారు.
ఇప్పటికే 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మికులను యాజమాన్యాలకు బానిసలుగా మార్చిన కేంద్ర ప్రభుత్వం వైఖరి పట్ల ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు. అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్న నడ్డి విరగొట్టేందుకు మూడు నల్ల చట్టాలు తెచ్చి రైతులను కూలీలుగా మార్చేందుకు, కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేసేందుకు చేస్తున్న యత్నాలను తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు. రైతులు ఢల్లీిలో తొమ్మిది మాసాలుగా ఉద్యమం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు, ఉద్యోగులు, కార్మికులతో పాటు ప్రజల పైన కూడా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో భారాలను మోపుతున్నారన్నారు. ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం కారణంగా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తుంటే…ఇటు జగన్‌ ప్రభుత్వం ఒకవైపు కరోనా…మరోవైపు పనుల్లేక పస్తులుంటున్న కార్మికుల జీవితాలను గాలికొదిలేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అత్తిలి విమల మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలకు నిరసనగా ప్రజా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయని…రానున్న రోజుల్లో ఆఉద్యమాలే వేదికగా ప్రజల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతామన్నారు.
ఈ కార్యక్రమంలో జట్లు లేబర్‌ యూనియన్‌ అధ్యక్షులు కూండ్రపు రాంబాబు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జుత్తుక కుమార్‌, చెల్లుబోయిన కేశవశెట్టి, తోకల ప్రసాద్‌, శీలం వెంకటేష్‌, పి.రాము, పి.సత్యనారాయణ, నగర సహాయ కార్యదర్శి వంగమూడి కొండలరావు, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నల్లా భ్రమరాంబ, ప్రధాన కార్యదర్శి జి.లోవరత్నం, ప్రజా నాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి మహంతి లక్ష్మణరావు, పార్టీ ప్రజాసంఘాల నాయకులు సేపేని రమణమ్మ, సప్పా రమణ, కిర్ల కృష్ణ, సిడగం నౌరోజీ, వానపల్లి సూర్యనారాయణ, ముప్పన వీరభద్రరావు, కె.రామకృష్ణ, జిఏ రామారావు, పామర్తి సూర్య ప్రకాశరావు, కేతా నాగేశ్వరరావు, అడియారపు శ్రీను, బోడకొండ, బొడ్డు బుల్లబ్బాయి, ముప్పన కుమార్‌, బీసపు నాగబాబు, శివకోటి రాజు, కె.రామకృష్ణ, మాధవస్వామి, వై.బాబి, బొమ్మసాని రవిచంద్ర, జట్లు లేబర్‌ యూనియన్‌ ఉపాధ్యక్షులు పెంటు దేముడు, గొంటి వెంకట్రావు, సంయుక్త కార్యదర్శులు రెడ్డి వెంకట్రావు, గోగుల మోహన్‌ కృష్ణ, కోశాధికారి కాళ్ళ అప్పలనాయుడు, మొగల్‌ జీనత్‌ బేగం, ఉమా మహేశ్వరి, ఆర్‌.గౌరి, సీపీఐ, ఏఐటీయూసీ, జట్లు కార్మికులు పెద్దయెత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img