Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై బిగిసిన ఉక్కు పిడికిలి

అమ్మేవాడెవ్వడు? కొనేవాడెవ్వడు? అంటూ గర్జించిన కార్మికులు
కేంద్రం దిగిరాకుంటే ఉద్యమం మరింత ఉధృతం
ఏఐటీయూసీ నేతలు రవీంద్రనాథ్‌, ఓబులేసు హెచ్చరిక

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు భారీ ప్రదర్శ నలు, ధర్నాలు సహా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విప్లవాత్మక పోరా టాలు, అనేకమంది ప్రాణత్యాగాల ద్వారా సాధిం చుకున్న వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మేవాడె వ్వడు కొనేవాడెవ్వడు అంటూ కార్మికులు గర్జించారు. విశాఖ ఉక్కు` ఆంధ్రుల హక్కు అంటూ నినదిం చారు. కేంద్రం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఆందోళనలు జరిగాయి. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని కార్మికులు స్పష్టం చేశారు. తమశక్తిని తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించారు. విశాఖపట్నంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అధ్వర్యాన భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 149వ రోజుకు చేరగా, విశాఖ నగరంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన మెగా బైక్‌ ర్యాలీకి ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు హాజరయ్యారు. ఓబులేసు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ శాసనసభ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం అవహేళన చేసిందని మండిపడ్డారు. గతంలో ఎందరో ప్రధానులు తెలుగువారిపై తీసుకున్న నిర్ణయాలను తదనుగుణంగా ఉపసంహరించుకున్న దాఖలాలు చాలా ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్రం భేషజాలకు పోకుండా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రక్షణ కోసం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గపూర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాటలను పెడచెవిన పెట్టి కేంద్రం విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇది రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్‌ పెద్దన్న పాత్ర పోషించి అన్ని రాజకీయ పక్షాలను, కార్మిక సంఘాలను సమావేశపరిచి ఉమ్మడి పోరాటానికి సిద్ధం కావాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ గాజువాక ఇన్‌చార్జ్‌ శ్రీదేవన్‌ రెడ్డి మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకాన్ని తమ పార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్ధించబోదని స్పష్టం చేశారు. ఇప్పటికే సమస్య

పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రెండు ఉత్తరాల ద్వారా సూచనలు చేశారన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ, కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌, కో కన్వీనర్లు గంధం వెంకట్రావు, కె.సత్యనారాయణ రావు, సభ్యులు వైటి దాస్‌, జె.సింహాచలం, మురళి రాజు, సంపూర్ణం, మసేన్‌రావు, వై.మస్తానప్ప, దొమ్మేటి అప్పారావు, బొడ్డు పైడిరాజు, సీహెచ్‌ సన్యాసిరావు, డి.సురేష్‌బాబు, కొమ్మినేని శ్రీనివాస్‌, వరసాల శ్రీనివాస్‌, మహాలక్ష్మి నాయుడు, డేవిడ్‌, రసూల్‌ బేగ్‌, పరంధామయ్య, అప్పలరాజు, నిర్వాసిత సంఘ నాయకులు పులి రమణారెడ్డి, జెర్రిపోతుల ముత్యాలు, ఒప్పంద కార్మికసంఘం ప్రతినిధులు కేఎం శ్రీనివాస్‌, శ్రీనివాసరాజు, వివిధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
కేంద్ర బృందాన్ని అడ్డుకుంటాం : రవీంద్రనాథ్‌
కేంద్రం పంపిస్తున్న బృందాన్ని విశాఖపట్నంలో అడుగు పెట్టనీయమని, ప్రతిఘటించి తీరుతామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ హెచ్చరించారు. వందలాది రోజులుగా ఉద్యమం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరు విజయటాకీస్‌ సెంటర్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రావులపల్లి రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నా.. శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినా కేంద్రానికి లెక్క లేకుండా పోయిందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న పరిశ్రమను, అనుబంధ ఇతర ఆస్తులను కారుచౌకగా అదానీ కంపెనీకి అప్పజెప్పడానికి కేంద్రం ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రజలు ఏకతాటిపైకి వచ్చి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమతో పాటు రక్షణ రంగంలో కీలకమైన ఆయుధాల తయారీ ఫ్యాక్టరీలను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర పూనుకుందని, దీనిని కేంద్ర కార్మిక సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయన్నారు.
రక్షణ రంగంలో పనిచేసే 80 వేల మంది ఉద్యోగులు సాగించిన పోరాటాల ఫలితంగా రక్షణ రంగాన్ని ప్రైవేటీకరించబోమని అధికారులు హామీ ఇచ్చారని, అయితే నేడు తిరిగి ఆయుధ ఫ్యాక్టరీలను ప్రైవేటీకరించే ప్రయత్నం ప్రారంభించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ గుంటూరు జిల్లా నాయకులు కోట మాల్యాద్రి, చల్లా చినఆంజనేయులు, నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావుల అంజిబాబు, ఆకిటి అరుణ్‌కుమార్‌, మంగా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు సీహెచ్‌ కోటేశ్వరరావు తలకిందులుగా పడుకుని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌, బండి వెంకటేశ్వర్లు, చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏఐటీయూసీ నేతలు పి.మురళి, రాధాకృష్ణ, అనంతపురంలో జె.రాజారెడ్డి, రాజేష్‌, కడపలో ఎల్‌.నాగసుబ్బారెడ్డి, జి.వేణుగోపాల్‌, కర్నూలులో ఎస్‌.మునెప్ప, రామకృష్ణారెడ్డి, ఒంగోలులో బి.సురేష్‌, బి.శామ్యూల్‌, నెల్లూరులో దామా అంకయ్య తదితరుల నాయకత్వంలో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img