Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వెయ్యికి దిగొచ్చిన కరోనా కొత్త కేసులు

స్వల్ప హెచ్చుతగ్గులతో దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో నిన్న భారీ పెరిగిన కేసులు.. ఇవాళ తగ్గుముఖం పట్టాయి. తాజాగా వెయ్యికి దిగొచ్చాయి. మరణాల్లో అనూహ్య తగ్గుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలో నమోదైన కరోనా గణాంకాలను కేంద్రం మంగళవారం వెల్లడిరచింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,247 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే 43శాతం కేసులు తగ్గాయని పేర్కొంది. మరో మరణాలు సైతం భారీగా తగ్గాయి. కరోనాతో గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. తాజాగా 928 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజాగా కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,30,45,527కు పెరిగింది. ఇందులో 4,25,11,701 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఇప్పటి వరకు 5,21,966 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.03శాతం ఉన్నాయని, ప్రస్తుతం రికవరీ రేటు 98.76శాతానికి పెరిగిందని పేర్కొంది.నిన్న 16.89 లక్షల మంది టీకా తీసుకోగా, ఇప్పటివరకూ 186 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img