Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వైరస్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యాం : డబ్ల్యూహెచ్‌ఓ

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇంకా అనేక దేశాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించే పనిలో ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనమ్‌ గెబ్రియాసిస్‌ చెప్పారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను అదుపు చేసేందుకు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. వైరస్‌ను అంచనా వేయడంలో విఫలం అయ్యామని, ఒమిక్రాన్‌ వల్ల స్వల్ప తీవ్రత ఉన్న వ్యాధి సోకినా, దాంతో ఆరోగ్య వ్యవస్థపై మళ్లీ ప్రభావం పడుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో అసమానతలు ఉన్నట్లు టెడ్రోస్‌ తెలిపారు. ఒమిక్రాన్‌ వేళ కొన్ని దేశాలు బూస్టర్‌ డోసులు ఇస్తున్నాయని, కానీ ఇంకా కొన్ని దేశాలకు అసలు వ్యాక్సిన్లు అందలేదన్నారు. కోవిడ్‌ వ్యాప్తిని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది..ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు 13 వేలు దాటాయని తెలిపింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగితే.. దీని ప్రభావం మన ఆరోగ్య వ్యవస్థపై తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img