Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వైసీపీ ఖాతాలోనే ఆత్మకూరు

82వేల ఓట్ల మెజారిటీతో మేకపాటి విక్రమ్‌రెడ్డి గెలుపు

విశాలాంధ్ర బ్యూరో` నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్‌ రెడ్డి 82,888 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. అంతకుముందు ఈ నియోజకవర్గానికి ప్రాతి నిధ్యం వహిస్తున్న మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందుకోసం ఈనెల 23వ తేదీ పోలింగ్‌ నిర్వహించి ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ, బిఎస్పీ అభ్యర్థులతో పాటు మరో 11 మంది ఇండిపెండెంట్లుగా బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన లెక్కింపులో మొదటి రౌండ్‌నుంచి వైసీపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ వచ్చింది. మొత్తం 64 శాతం ఓట్లు పోల్‌కాగా వాటిని 14 టేబుళ్లలో 20 రౌండ్లుగా విభజించి లెక్కింపు ప్రారంభించారు. పోలైన మొత్తం ఓట్లలో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,074 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన భరత్‌కుమార్‌కు 19,353 ఓట్లు, బీఎస్పీ అభ్యర్ధి ఓబులేసుకు 4,904 ఓట్లు, నోటా కింద 4,182 ఓట్లు నమోదయ్యాయి. దీంతో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 82,888 ఓట్లతో ఆధిక్యం సాధించారు. ఇంతటి ఘన విజయానికి కారణం సీఎం చేస్తున్న సుపరిపాలన, ప్రవేశ పెట్టిన పథకాలేనని, తన సోదరుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రజలకు అందించిన అభివృద్ధి చేయూత వల్లనే తాను అత్యధిక మెజార్టీతో గెలుపొందానని విక్రమ్‌రెడ్డి అన్నారు. తనపై నమ్మకంతో ఇంత మెజార్టీ ఇచ్చిన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనన్నారు. నియోజకవర్గంలో ప్రధానసమస్య సోమశిల ఉత్తర కాలువ పనులను త్వరలో పూర్తి చేయుడం ద్వారా నియోజకవర్గంలో సాగును పెంచేందుకు కృషిచేస్తానన్నారు. తన అన్న ఆశయాలకు అనుగుణంగా అన్న నడిచిన బాటను స్ఫూర్తిగా తీసుకుని మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషిచేస్తానన్నారు. ఎన్నికల సమయంలో తన విజయానికి కృషిచేసిన వైసీపీ పార్టీ కార్యకర్తలకు, నలుమూలల నుంచి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు పేరుపేరునా ధన్యవాదాలు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img