Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వ్యవస్థలు కత్తి కట్టినా… గుండె చెదరలేదు

మంచిని ఓర్వలేని దుష్టచతుష్టయం
టీడీపీ ఎన్నికల ప్రణాళిక మాయం
వైసీపీ ప్లీనరీకి భారీగా కార్లతో పార్టీ శ్రేణుల రాక
గుంటూరు`విజయవాడ రహదారిపై రద్దీ
పార్టీ అధినేత జగన్‌ ప్రారంభోపన్యాసం
వైఎస్‌ విజయమ్మ కీలక ప్రసంగం
తొలిరోజు మంత్రులు ధర్మాన, బొత్స, రోజా, ఆదిమూలపు సురేశ్‌ ప్రసంగం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: జగమంత కుటుంబం ఏనాడూ నా చేయి వీడలేదు… పార్టీ ప్రయాణంలో ఎన్ని ముళ్లున్నా, రాళ్లు పడినా, ఎన్ని వ్యవస్థలు మనపై కత్తి కట్టినా, దుష్ప్రచారాలు చేసినా ఆ కట్టు కథకు విలువలేదు… నా గుండె చెదరలేదు, నా సంకల్పం ఆగలేదు…’ అని వైసీపీ అధినేత, సీఎం జగన్‌ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జరిగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైసీపీ) ప్లీనరీలో సీఎం జగన్‌ ప్రారంభోపన్యాసం చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జగన్‌, వైఎస్‌ విజయమ్మ పూలమాలలేసి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ ప్లీనరీకి తొలిరోజు 26 జిల్లాల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. తొలుత జగన్‌, వైఎస్‌ విజయమ్మ వేదికపైకి వచ్చి పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. మళ్లీ మళ్లీ రావాలి జగన్‌ అంటూ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నినదించారు. వైసీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమావేశానికి అధ్యక్షత వహించారు. వైసీపీ అధినేత జగన్‌ ప్రసంగిస్తూ, అధికారమంటే అహంకారం కాదని, ప్రజలపై మమకారమంటూ నిరూపించామని అన్నారు. 2009, సెప్టెంబర్‌ 25న పావురాలగుట్టలో సంఘర్షణ మొదలైంది. ఓదార్పు యాత్రతో పార్టీ ఒక రూపం దాల్చిందని, వైఎస్సార్‌ ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. నన్ను ప్రేమించి, నాతో వెన్నుదన్నుగా నిలబడిన కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ 13 ఏళ్ల ప్రయాణంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నామని, నాన్న (వైఎస్సార్‌) నాకు ఇచ్చిన ఈ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img