Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వ్యాక్సినేషన్‌లో మందగమనం!


దేశంలో వ్యాక్సినేషన్‌ వేగం తగ్గిపోయింది. కేంద్రం సార్వత్రిక టీకా కార్యక్రమం ప్రారంభించిన నాటితో పోల్చితే రోజువారీ సగటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో నెమ్మదితనం కనిపిస్తోంది.దేశంలో ఇప్పటివరకూ 37.50 కోట్ల మందికి టీకాలు వేశారు. అయితే నిన్న అతి తక్కువగా 12.13 లక్షల మందికే టీకాలు వేశారు. ఇంతకుముందు వారంలో రోజువారీ టీకాలు వేసే సంఖ్య పెరుగుతూ రాగా, ఆ తర్వాత నుంచి కాస్త తగ్గుతూ వస్తోంది. కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ వేగం పుంజుకుంటే..మరికొన్ని చోట్ల తగ్గింది. హర్యానా, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌, చత్తీస్‌గఢ్‌, రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌లో మందగమనం చోటుచేసుకుంది. కాగా కేరళ, అండమాన్‌ నికోబార్‌ దీవులు, దాద్రానగర్‌హవేలీ, జమ్ము,కాశ్మీర్‌ తదితర చోట్ల కాస్త వేగం పెరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img