Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వ్యూహాత్మక బంధం మరింత పటిష్ఠం

కోవిడ్‌, ఉగ్రవాదంపై పోరుప్రధాన అజెండా
ఆస్ట్రేలియా, జపాన్‌ ప్రధానులనూ కలుస్తా..
ప్రధాని మోదీ ప్రకటన : అమెరికాకు పయనం

న్యూదిల్లీ : అమెరికా, భారత్‌ మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత పటిష్ఠపర్చుకోవడమే తన పర్యటన ఉద్దేశంగా ప్రధాని నరేంద్రమోదీ బుధవారం తెలిపారు. అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, జపాన్‌, అస్ట్రేలియా దేశాలతో సంబంధాలను బలపర్చుకునేందుకు తన అమెరికా పర్యటన దోహదమవుతుందని అకాంక్షించారు. మోదీ బుధవారం దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాకు ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. ఈ మేరకు ఫోటోలను ఆయన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అంతకుముందు అమెరికా పర్యటన, అజెండాపై అధికారిక ప్రకటన వెలువరించారు. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగించనున్న విషయాన్ని ప్రస్తావించారు. కోవిడ్‌`19 మహమ్మారి, ఉగ్రవాదంపై పోరు, వాతావరణ మార్పు తదితర అంతర్జాతీయ సవాళ్లను అధిగమించే దిశగా తీసుకోవాల్సిన ఉమ్మడి చర్యలతో పాటు అనేక కీలక అంశాలపై మాట్లాడతానని ప్రకటనలో పేర్కొన్నారు. ‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆహ్వానం మేరకు 2225 తేదీల్లో ఆ దేశంలో పర్యటిస్తాను. ఈ సందర్భంగా అమెరికాభారత్‌ సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బైడెన్‌తో కలిసి సమీక్షిస్తాను. పరస్పరం ప్రాదేశిక, అంతర్జాతీయ సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తాం. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తోనూ భేటీ కావాలని భావిస్తున్నాను. తద్వారా రెండు దేశాల మధ్య శాస్త్రీయ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకొనే అవకాశాలను అన్వేషించేందుకు ఆస్కారం ఉంటుంది. క్వాడ్‌ సదస్సులోనూ పాల్గొంటాను. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిస్సన్‌, జపాన్‌ ప్రధాని యోషిహిడె సుగాతోనూ ద్వైపాక్షిక చర్చలు జరుపుతాను. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, సవాళ్లపై చర్చిస్తాను. నా అమెరికా పర్యటన ఆ దేశంలో అంతర్జాతీయ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచే అవకాశంగా పరిణమిస్తుంది. జపాన్‌, ఆస్ట్రేలియాతోనూ సహకార బంధాన్ని పటిష్టపర్చుకొంటాం’ అని మోదీ వెల్లడిరచారు. ఇదిలావుంటే, మోదీబైడెన్‌ వాషింగ్టన్‌లో ముఖాముఖీ భేటీ అవుతారని, వీరిద్దరు అఫ్గాన్‌ పరిణామాలపైనా చర్చించే అవకాశమున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా తెలిపారు. బైడెన్‌ ఆతిథ్యమిచ్చే కోవిడ్‌19 అంతర్జాతీయ సదస్సులోనూ మోదీ పాల్గొంటారన్నారు. వాషింగ్టన్‌ పర్యటనను ముగించుకొని మోదీ న్యూయార్క్‌కు వెళతారని, అక్కడ ఐరాస జనరల్‌ అసెంబీ 76వ సెషన్‌లో ప్రసంగిస్తారని ష్రింగ్లా చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశానికి చెందిన బడా కంపెనీల ఎగ్జిక్యూటీవ్‌లతోనూ ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img