Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

శాసన మండలి రద్దు!

కేంద్ర ప్రభుత్వం పరిశీలన
రాజ్యసభలో మంత్రి కిరణ్‌ రిజుజు వెల్లడి

అమరావతి :జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం రaలక్‌ ఇచ్చింది. శాసనమండలిలో వైసీపీ మెజార్టీ సాధించడంతో దానిని రద్దు చేయాలన్న గత నిర్ణయంపై సీఎం మెత్తబడ్డారు. అందుకే కొంతకాలంగా పార్లమెంటు సమావేశాల అజెండాలో ఈ అంశాన్ని చేర్చేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. కేంద్రం కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో గురువారం హఠాత్తుగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపిన తీర్మానం ఏమైందని ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు సమాధానమిస్తూ కేంద్రం పరిశీలనలో ఉందని చెప్పారు. శాసనమండలి రద్దు, ఏర్పాటు అంశాలపై అసెంబ్లీల తీర్మానం మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీంతో జగన్‌ ప్రభుత్వం కొంత ఇరుకునపడిరది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల క్రితం వరకు శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీల మెజార్టీ సంఖ్య ఉంది. గతంలో మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల్ని ఆమోదించలేదన్న అక్కసుతో శాసనమండలిని రద్దు చేస్తూ వైసీపీ సర్కార్‌ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆ తీర్మానంపై కేంద్రం ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా ఖాళీస్థానాల్లో వైసీపీ సభ్యులు మెజార్టీ ఎన్నికవుతూ రావడంతో మండలిలోనూ మెజారిటీ సాధించారు. గతంలో పంపిన తీర్మానం మేరకు శాసనమండలిని రద్దు చేస్తే వైసీపీకే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. మండలి రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు చెప్పినా వైసీపీ ప్రభుత్వం అభాసుపాలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img