Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

సంపూర్ణ లాక్‌డౌన్‌కు సిద్ధం : దిల్లీ సర్కార్‌


తాము దిల్లీలో అవరసమైతే సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించడానికి సిద్ధమని కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడిరచింది. దేశ రాజధాని ఢల్లీిలో వాయుకాలుష్యంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తాము లాక్‌డౌన్‌కు సిద్ధంగా ఉన్నట్టు సుప్రీంకోర్టులో దిల్లీ సర్కారు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నగరాల్లో ఫస్ట్‌ ప్లేస్‌లో దిల్లీ నిలిచింది.. దీంతో ప్రమాదకర స్థాయిని దాటి పెరిగిపోయిన కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు..కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అవసరమైతే రెండ్రోజులు లాక్‌డౌన్‌ అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ఈ నేపథ్యంలో తాము లాక్‌డౌన్‌కు సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్‌ సర్కారు సుప్రీంకోర్టుకు తెలిపింది. సోమవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో, ‘‘స్థానిక వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి పూర్తి లాక్‌డౌన్‌ వంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది’’ అని పేర్కొంది. ‘‘అయితే, ఎన్‌సీఆర్‌ పొరుగు రాష్ట్రాల అంతటా అమలు చేస్తే అలాంటి చర్య అర్థవంతంగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. దిల్లీలో వాయు కాలుష్యం పెరగడాన్ని ‘‘అత్యవసర పరిస్థితి’’ అని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్నది. కీలకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ‘‘దిల్లీ కాంపాక్ట్‌ సైజు దృష్ట్యా, లాక్‌డౌన్‌ గాలి నాణ్యతపై పరిమిత ప్రభావాన్ని చూపుతుంది’’ అని అఫిడవిట్‌తో సమర్పించిన వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం తన వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img