Friday, April 19, 2024
Friday, April 19, 2024

సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకే

మోదీ గోవా పర్యటనపై రాహుల్‌ : కాంగ్రెస్‌ గెలుపుపై దీమా
పనాజీ : పర్యావరణం, నిరుద్యోగం వంటి వాస్తవ సమస్యలపై నుంచి గోవా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రధాని మోదీ యత్నిస్తున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. నెహ్రూ అనుకుంటే 1947లో కేవలం గంటల వ్యవధిలోనే గోవా విమోచనాన్ని పొంది ఉండేదని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ స్పందించారు. నాటి పరిస్థితులు, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏం జరిగిందో ప్రధానికి ఏమాత్రం అవగాహన లేదని అన్నారు. శుక్రవారం మార్గావ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ మాట్లాడారు. మోదీకి చరిత్ర తెలియదన్నారు. వాస్తవ పరిస్థితులపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆయన గోవాలో పర్యటిస్తున్నారని దుయ్యబట్టారు. ‘హిజాబ్‌’ వివాదంపై స్పందించేందుకు నిరాకరించారు. గోవా ప్రజల దృస్టిని మళ్లించే ఎలాంటి సంభాషణ తన వైపు నుంచి ఉండదన్నారు. గోవా ప్రజలకు ఏది ముఖ్యమన్న దానిపై దృష్టి పెట్టడమే తన మిషన్‌గా రాహుల్‌ చెప్పారు. కోస్తా రాష్ట్రంలో ఒక రోజు పర్యటించిన ఆయన మెజారిటీ స్థానంలో కాంగ్రెస్‌ గెలుపును ఆకాంక్షించారు. ఎన్నికల తర్వాత పొత్తు అవసరం రాదన్నారు. కాంగ్రెస్‌కు మెజారిటీ దక్కుతుందని, మరుక్షణం గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాహుల్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img