Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సహజ మిత్రులం – ఉగ్రవాదంపై పోరు ఆగదు

ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
అమెరికా, భారత్‌ బంధంపై మోదీ, కమలాహారీస్‌ స్పష్టీకరణ
జపాన్‌తో వాణిజ్యం, సాంస్కృతిక బంధానికి పెద్దపీట
జపాన్‌ ప్రధాని సుగాతోనూ ప్రధాని భేటీ

వాషింగ్టన్‌ : ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. క్వాడ్‌ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు అగ్రరాజ్యానికి వచ్చిన ఆయన తొలుత కార్పొరేట్‌ సంస్థల సీఈవోలతో భేటీ అయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. ఆపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌తో భేటీ అయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం జపాన్‌ ప్రధాని యోషిహిదే సుగాతో చర్చలు ఫలప్రదంగా జరిపారు. శుక్రవారం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో మోదీ శ్వేతసౌధంలో తొలిసారి భేటీ అయ్యారు. ఆమె గెలుపు చరిత్రాత్మకమని మోదీ కొనియాడారు. అమెరికా, భారత్‌ సహజ మిత్రులని తెలిపారు. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం, అంతర్జాతీయ అంశాలు, ప్రజాస్వామ్యానికి ముప్పు, అఫ్గాన్‌ పరిణామాలు, ఇండో`పసిఫిక్‌ సహా అనేక అంశాలపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య విలువలు, వ్యవస్థలను రక్షించాల్సిన బాధ్యత రెండు దేశాలపై ఉందని మోదీ, హారిస్‌ అంగీకరించారు. రెండు దేశాల మధ్య పటిష్ఠ ద్వైపాక్షిక బంధాన్ని ఇద్దరు నేతలు అభినందించారు. తమ మధ్య సహకారాన్ని, సయోధ్యను మరింత పెంచుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 56ఏళ్ల హారిస్‌ను భారత్‌కు రావాల్సిందిగా మోదీ ఆహ్వానించారు. భారత్‌- అమెరికా అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాలని, ఒకేరకమైన విలువలు, భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయని మోదీ అన్నారు. అధ్యక్షుడుగా బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ బాధ్యతలు చేపట్టే సమయానికి ప్రపంచం అత్యంత క్లిష్టసవాళ్లను ఎదుర్కొంటోందని, వీరు అతి తక్కువ సమయంలోనే చాలా లక్ష్యాలను చేరుకున్నారని, అవి కోవిడ్‌-19, వాతావరణ మార్పులు లేదా క్యాడ్‌ వంటివి’ అని కితాబిచ్చారు. కోవిడ్‌ విజృంభణ వేళ అమెరికా
సంఫీుభావం తెలిపినందుకు కృతజ్ఞతలు ప్రకటించారు. కమలా హారిస్‌ మాట్లాడుతూ గతంతో పోల్చుకుంటే ప్రపంచం మరింత ఇంటర్‌ కనెక్టెట్‌గా ఇంటర్‌ డిపెండెంట్‌గా మారిందన్నారు. మనం ఎదుర్కొంటున్న సవాళ్లు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. కోవిడ్‌, వాతావరణ మార్పు, ఇండోపసిఫిక్‌ అంశాల ప్రాధాన్యతను గుర్తుచేశారు. వాతావరణ మార్పుపై సంయుక్త చర్యలు అవసరమన్నారు. పునరుత్పాదక శక్తి పెంపుదల, నేషనల్‌ హైడ్రోజన్‌ మిషన్‌ ప్రారంభం వంటి అంశాలను మోదీ ప్రస్తావించారు. ఈ భేటీలో ఉగ్రవాదం అంశం చర్చకు రాగా పాక్‌ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని కమలాహారిస్‌ నొక్కిచెప్పారు. ఉగ్రసంస్థలకు పాక్‌ స్వర్గధామంగా ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా, భారత భద్రతపై ప్రభావం చూపకుండా చర్యలు తీసుకోవాలని ఆమె పాకిస్థాన్‌ను కోరారు. భారత్‌ అనేక దశాబ్దాలుగా తీవ్రవాద బాధిత దేశంగా ఉందన్నారు. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ మద్దతిస్తుండటంపై నిశిత పర్యవేక్షణ అవసరమని హారిస్‌ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామిక విలువలు, వ్యవస్థల పరిరక్షణ బాధ్యత తమ రెండు దేశాలపై ఉందన్నారు. రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాలను కాపాడటం తమ బాధ్యతన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయి. అంతర్గతంగా ప్రజాస్వామ్యాలను బలోపేతం చేయడానికి ఏం చేయగలమో చేద్దాం...అమెరికా, భారత్‌ ప్రజల ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాలను కాపాడటం మన బాధ్యత’ అని మోదీతో భేటీలో కమలా హారిస్‌ అన్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్‌ ష్రింగ్లా పేర్కొన్నారు. పాకిస్థాన్‌ మద్దతిస్తున్న ఉగ్రవాద సంస్థలను నిశితంగా పరిశీలించి, నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కిచెప్పారన్నారు. జపాన్‌ ప్రధాని సుగాతో ఆసక్తికర చర్చలను మోదీ జరిపారు. భారత్‌జపాన్‌ వాణిజ్యం, సాంస్కృతిక, రక్షణ, టెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని పెంచుకోవాలని, తమ సహకార బంధాన్ని పటిష్టపర్చుకోవా లని ఇద్దరు నేతలు నిర్ణయించారు. అంతర్జాతీయ పరిణామాలు, అఫ్గాన్‌ అంశాలపైనా చర్చించారు. భారత్‌`జపాన్‌ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కొనసాగించే క్రమంలో ప్రధానిగా, గతంలో ప్రధాన కేబినెట్‌ కార్యదర్శిగా సుగా వ్యక్తిగత నిబద్ధత, నాయకత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలపై మాట్లాడుకున్నారు. రెండు దేశాల మధ్య సఖ్యత, సాంస్కృతిక బంధంతో పాటు ఆర్థిక ఒప్పందాలకూ కట్టుబడి ఉంటామన్నారు. జెన్‌ గార్డెన్‌, కైజెన్‌ అకాడమీ వంటివి రెండు దేశాల మధ్య ఆధునిక బంధానికి చిహ్నాలని మోదీ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img