Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సహనాన్ని పరీక్షిస్తున్నారా..?

ట్రైబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయకపోవడంపై కేంద్రంపై సుప్రీం సీరియస్‌
ట్రైబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయకపోవడంపై కేంద్రంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టు తీర్పులంటే కేంద్రానికి గౌరవం లేదని,తమ సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ మండిపడిరది. ట్రైబ్యునళ్లలో నియామకాలకు సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌, నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ వంటి కీలక ట్రైబ్యునళ్లలో ఖాళీలున్నాయని, వీటితోపాటు సాయుధ బలగాలు, వినియోగదారులకు సంబంధించిన వాటిలోనూ చాలా ఖాళీలున్నాయని, దీనివల్ల అనేక కేసుల్లో పరిష్కారం లభించక వాయిదా వేయాల్సిన పరిస్థితి వస్తోందని పేర్కొంది. గత రెండేళ్ల నుంచి ట్రైబ్యునళ్లలో ఖాళీలు ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్క నియామకం కూడా జరపలేదని అసహనం వ్యక్తంచేసింది. కోర్టు ముందు మూడు దారులున్నాయని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ట్రైబ్యునళ్లను రద్దు చేయమంటారా?.కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలా? అంటూ ఆయన ప్రశ్నించారు. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. ఈలోపు సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్వీ రమణ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img