Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సాగులో డ్రోన్ల వాడకం రైతులకు ‘ఓ వినూత్న ఉత్తేజకర ఆరంభం’


వంద ‘కిసాన్‌ డ్రోన్ల’ను ప్రారంభించిన మోదీ
వ్యవసాయరంగంలో కీలక మార్పునకు మోడీ సర్కార్‌ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.పంట పొలాల్లో పురుగుమందులు చల్లడంతోపాటు ఇతర వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులను మోసుకెళ్లేలా సరికొత్త ‘కిసాన్‌ డ్రోన్ల’ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఒకేసారి 100 కిసాన్‌ డ్రోన్లను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. వివిధ నగరాల్లో, పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. సాగులో డ్రోన్ల వాడకం రైతులకు ‘ఓ వినూత్న ఉత్తేజకర ఆరంభం’ అని మోదీ అభివర్ణించారు. రాబోయే రెండేళ్లలో గరుడ ఏరోస్పెస్‌ కింద లక్ష మేడ్‌ ఇన్‌ ఇండియా డ్రోన్లను తయారు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇది యువతకు కొత్త ఉపాధి, కొత్త అవకాశాలను తీసుకువస్తుందని అన్నారు. 21వ శతాబ్దపు ఆధునిక వ్యవసాయ సౌకర్యాల దిశలో ఇది కొత్త అధ్యాయం అని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో అపరిమిత అవకాశాలు వస్తాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డ్రోన్‌ల ద్వారా రైతులకు ఎంతో సహకారంగా ఉంటుందని భావిస్తున్నట్లు మోదీ అన్నారు. 2022-23 వార్షిక బడ్జెట్‌లో దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేసే బడ్జెట్‌ కేటాయించినట్లు పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా రైతులకు డిజిటల్‌, హైటెక్‌ టెక్నాలజీని అందించడానికి కేంద్రం కిసాన్‌ డ్రోన్లు, రసాయన రహిత సహజ వ్యవసాయం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతామాన్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా తెలిపారని అన్నారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, భూ రికార్డుల డిజిటలైజేషన్‌, పురుగుమందులు, పోషకాలను పిచికారీ చేయడం కోసం కిసాన్‌ డ్రోన్‌లను ప్రోత్సహిస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img