Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సాయుధ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదే

మతోన్మాద బీజేపీకి మాట్లాడే అర్హత లేదు
కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి విమర్శ
ఘనంగా 74వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉత్సవాలు ప్రారంభం

భూమి, భుక్తి కోసం, వెట్టిచాకిరి, విముక్తి కోసం, నిజాం నిరంకుశ పాలన అంతం కోసం సాగించిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టులదేనని, మతోన్మాద బీజేపీ నాయకులకు మాట్లాడే హక్కు లేదని సీపీఐ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ విమర్శించారు. తెలంగాణ చరిత్రను చెరిపేసి, అసత్యాలు ప్రచారం చేసి, చరిత్రను వక్రీకరించి తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ యత్నిస్తుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం కొన్ని బూర్జువా పార్టీలు ఈ పోరాటాన్ని వక్రీకరిస్తూ హిందూ, ముస్లింల పోరాటంగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.

హైదరాబాద్‌ : భూమి, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం, నిజాం నిరంకుశ పాలన అంతం కోసం సాగించిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టులదేనని, మతోన్మాద బీజేపీ నాయకులకు మాట్లాడే హక్కు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ విమర్శిం చారు. తెలంగాణ చరిత్రను చెరిపేసి, అసత్యాలు ప్రచారం చేసి, చరిత్రను వక్రీకరించి తెలంగాణలో అధికారం లోకి రావడానికి బీజేపీ యత్నిస్తోందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం కొన్ని బూర్జువా పార్టీలు ఈ పోరాటాన్ని వక్రీకరిస్తూ హిందూ, ముస్లింల పోరాటంగా చిత్రీకరిస్తున్నాయని విమర్శిం చారు. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షి కోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా జయప్రదం చేయాలని నారాయణ కోరారు. 74వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉత్సవాలు శనివారం సీపీఐ హైదరాబాద్‌ జిల్లా సమితి అధ్వర్యంలో హైదరాబాద్‌ అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌పై ఉన్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌ విగ్రహం వద్ద ఘనంగా ప్రారంభమయ్యాయి. నారాయణతో పాటు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్‌ అజీజ్‌ పాషా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌ రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యుడు వీఎస్‌. బోస్‌, నేతలు పశ్య పద్మ, ఎన్‌. బాల మల్లేష్‌, కలవేణి శంకర్‌ తదితరులు హాజరయ్యారు. అనంతరం జరిగిన సభకు సీపీఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఈటీ నరసింహ అధ్యక్షత వహించారు. అంతకుముందు మఖ్దూమ్‌ మొహియు ద్దీన్‌కు నివాళులర్పించారు. సభలో చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, నిజాం నిరంకుశ పాలన, బానిస బతుకుల విముక్తి కోసం జరిగిన రైతాంగ సాయుధ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదేనని అన్నారు. ఈ పోరాటం కుల మతాల మధ్య జరిగినట్లుగా చూపే ప్రయత్నం జరుగుతోందని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పడక ముందు రైతాంగ సాయుధ పోరాటం చరిత్రను ప్రభుత్వపరంగా గుర్తిస్తామని హామీ ఇచ్చిన ముఖ్య మంత్రి కేసీఆర్‌, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను మరిచారని చాడ విమర్శించారు. ప్రజలు వాస్తవాలను గ్రహించాలని, తెలంగాణ శ్రేయస్సు కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం అరుణపతాకాలు చేబూని వేలాదిమందితో తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌ విగ్రహం వద్ద నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ఎం. నరసింహ, ఎస్‌ ఛాయాదేవి, కమతం యాదగిరి, నిర్లేకంటి శ్రీకాంత్‌, ఎ. రాజ్‌ కుమార్‌, అర్‌. మల్లేష్‌, శక్రి భాయి, అమీనా, స్టాలిన్‌, నరేష్‌, హరికృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img