Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సీజేఐ ఎన్‌వీ రమణ కీలక నిర్ణయం

మరో ధర్మాసనానికి జలవివాదాల కేసు

న్యూదిల్లీ : కృష్ణాజలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ తప్పుకున్నారు. కృష్ణానది నుంచి తాగు, సాగునీటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా తనకు రావాల్సిన వాటా కన్నా అధికంగా వినియోగించుకుంటుందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. మధ్యవర్తిత్వానికి బదులుగా సుప్రీంకోర్టు ద్వారానే ఈ సమస్యకు న్యాయం జరగాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుకుంటున్నట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ కేసు విచారణ నుంచి తాను తప్పుకుంటున్నానని, దీనిని మరో ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు జస్టిస్‌ ఎన్‌వీ రమణ స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థనపై సీజేఐ నాయకత్వంలోని ధర్మాసనం విచారణ జరపడానికి తమకేమీ అభ్యంతరం లేదని కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా విన్నవించారు. కృష్ణా జలాల వివాదాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నిన్న రెండు రాష్ట్రాలకు సూచించింది. అనవసరంగా జోక్యం చేసుకోవాలని కోర్టు కోరుకోవడం లేదని తెలిపింది. ‘న్యాయపరంగా ఈ అంశాన్ని విచారించాలని నేను కోరుకోవడం లేదు. నేను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని. మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తే అలాగే చేసుకోవాలని సూచిస్తున్నాను. అందుకు మేము సహాయపడతాం. లేకపోతే ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేస్తాను’ అని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీజేఐ ఆగస్టు 2వ తేదీన తేల్చిచెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img