Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సీ-130 విమానంలో ఎక్స్‌ప్రెస్‌వేపై దిగిన ప్రధాని మోదీ

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ జిల్లా కర్వాల్‌ ఖేరీ వద్ద ప్రధాని మోదీ పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేను మంగళవారం ప్రారంభించారు. లక్నో నుంచి ఉత్తరప్రదేశ్‌ రాజధాని ఘాజీపూర్‌ వరకు 340.8 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. పూర్వంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై నిర్మించిన ఎయిర్‌ స్ట్రిప్‌పై ఆ సీ-130 విమానం ల్యాండయ్యింది. ఎయిర్‌స్ట్రిప్‌ వద్ద గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రధానికి స్వాగతం పలికారు. వీలుగా ఎక్స్‌ప్రెస్‌వేపై 3.2 కిలోమీటర్ల ఎయిర్‌స్ట్రిప్‌ను నిర్మించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ వేను మొత్తం 341 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే లక్నో జిల్లాలో లక్నో-సుల్తాన్‌పూర్‌ జాతీయ రహదారిపైగల చౌద్‌సరాయ్‌ గ్రామం వద్ద ప్రారంభమై.. ఉత్తరప్రదేశ్‌-బీహార్‌ సరిహద్దుకు తూర్పున 18 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి 31 మీదగల హైదరియా గ్రామం వద్ద ముగుస్తుంది. రూ. 22,500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. అత్యవసర సమయాల్లో ఎయిర్‌ఫోర్స్‌ ఫైటర్‌ జెట్‌లు ల్యాండ్‌ అవడానికి, టేకాఫ్‌ అవడానికి వీలుగా ఈ ఎక్స్‌ప్రెస్‌ వేపై నిర్మించిన 3.2 కిలోమీటర్ల ఎయిర్‌ స్ట్రిప్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఎయిర్‌స్ట్రిప్‌ వేదిక నుండి ప్రధాని వివిధ విమానాల ద్వారా ఎయిర్‌ షోను తిలకించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img