Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సుప్రీంకోర్టులో మొదలైన ప్రత్యక్ష ప్రసారాలు…

సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపట్టిన విచారణను తొలిసారి లైవ్‌లో ప్రసారం చేశారు. శివసేనకు సంబంధించిన కేసును ధర్మాసనం విచారణ చేపట్టింది. సీఎం షిండే, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు చెందిన కేసును ధర్మాసనం విచారించింది. సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న కేసుల్ని లైవ్‌లో ప్రసారం చేయాలని గతవారం సుప్రీంకోర్టు నిర్ణయించిన విషయం తెలిసిందే. సీజేఐ యూయూ లలిత్‌ నేతృత్వంలో గతవారం ఏకగ్రీవం నిర్ణయం తీసుకున్నారు.రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న కేసుల్ని లైవ్‌ చేయాలని 2018, సెప్టెంబర్‌ 27వ తేదీన ఆ నాటి సీజేఐ దీపక్‌ మిశ్రా తెలిపారు.యూట్యూబ్‌ లేదా మరే ఇతర ప్లాట్‌ ఫామ్‌ కై కాకుండా, ఎన్‌ఐసీ ప్లాట్‌ ఫామ్‌ పై ఆన్‌ లైన్‌ విచారణ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. భవిష్యత్తులో ప్రత్యేక ఓటీటీని కూడా తీసుకురావాలన్నది సుప్రంకోర్టు యోచన. మధ్యప్రదేశ్‌ హైకోర్టు కూడా ఓటీటీని తీసుకొచ్చే క్రమంలో ఉంది. యూట్యూబ్‌ కాకుండా కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేదుకు తమ సొంత ప్లాట్‌ ఫామ్‌ ను తీసుకొస్తామని ప్రధాన న్యాయమూర్తి ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ సోమవారమే ప్రకటించారు. ఈ లైవ్‌ ప్రసారాలను ప్రజలు తమ సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లలో వీక్షించవచ్చు. అయితే ఆగస్టు 26వ తేదీన మాజీ సీజేఐ ఎన్వీ రమణ వెబ్‌ పోర్టల్‌ ద్వారా లైవ్‌ ప్రసారాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img