Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సోనియా, రాహుల్‌గాంధీకి ఈడీ నోటీసులు

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, సోనియాగాంధీ ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి ి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది.నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో ఈ నెల 8న ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా తెలిపారు. సోనియా జూన్‌ 8న ఈడీ కార్యాలయానికి వెళ్తారని ఈ పార్టీ అభిషేక్‌ మను సింఫ్వీు తెలిపారు. రాహుల్‌ విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆ లోపు తిరిగి వస్తే ఈడీ ఎదుట హాజరవుతారని, రాలేకపోతే కొంత సమయం కోరే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈడీ నోటీసులపై రణదీప్‌ సూర్జేవాలా విమర్శలు గుప్పించారు. ప్రతిసారీ నేషనల్‌ హెరాల్డ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ.. బీజేపీ స్వాతంత్య్ర సమరయోధులను అవమానించిందని, అగౌరవపరిచిందని ఆరోపించారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను 1942లో ప్రారంభించారని, అప్పట్లో బ్రిటిష్‌ వారు దాన్ని అణవిచివేసేందుకు ప్రయత్నించారని, నేడు మోదీ ప్రభుత్వం ఈడీని ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img