Friday, April 19, 2024
Friday, April 19, 2024

సోవియట్‌ వ్యవస్థకే రష్యన్లు మొగ్గు

మాస్కో : సగంమంది రష్యన్లు సోవియట్‌ వ్యవస్థను బల పరిచారు. రష్యాలో పెట్టుబడీదారీ విధానం అమలు లోకి వచ్చిన 30 సంవత్సరాల తరువాత కమ్యూనిస్టు వ్యతిరేకత ఉన్నప్పటికీ సోషలిజం ప్రజల మనస్సుల్లో నెలకొన్నట్లుగా తెలుస్తోంది. సోషలిస్టు కాలం నాటి విజయాలను ఈ తరం రష్యన్లు ప్రశంసిస్తున్నారని లెవెడా సెంటర్‌ నిర్వహించిన తాజా పోల్‌ నిర్థారిం చింది. ఈ ఏడాది ఆగస్టు 1926 మధ్య నిర్వహించిన తాజా సర్వే ప్రకారం. సగంమంది రష్యన్లు (49శాతం) సోవియట్‌ రాజకీయ వ్యవస్థను సమర్థించారు. కేవలం 18శాతం మాత్రమే ప్రస్తుత రాజకీయ వ్యవస్థను సరైనదిగా ఎంచుకున్నారు. 55 సంవత్సరాలు పైబడిన వారిలో దాదాపు (62శాతం మంది) సోవియట్‌ రాజకీయ వ్యవస్థ అత్యంత ప్రజాదరణ పొందింది. మూడిరట రెండు వంతుల మంది రష్యన్లు (62 శాతం) ఉత్తమ ఆర్థికవ్యవస్థను నమ్ముతారు. కేవలం 24 శాతం మాత్రమే ప్రైవేటు ఆస్థులు, మార్కెట్‌ సంబంధాల అధారంగా ఒక వ్యవస్థకు మొగ్గు చూపారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ (సీపీఆర్‌ఎఫ్‌)పై సోషలిజం కమ్యూనిజం విధానాలను చెల్లనివిగా అపనిందలు వేయడానికి బూర్జువా ప్రభుత్వాలు ప్రయత్నించినప్ప టికీ రష్యాలో సోషలిజం ఆదర్శాలు పెనవేసుకుపోయాయి. పెరిస్త్రోయికాకు మందు దేశంలో జీన జీవితం మెరుగ్గా ఉండేదని4 7శాతం మంది రష్యన్లు అంగీకరించారు. సోవియట్‌ యూనియన్‌ శకం దేశ చరిత్రలో గొప్పకాలంగా 75శాతం మంది రష్యన్లు నమ్మినట్లు తాజా అధ్యయనం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img