Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సోషల్‌ స్టేటస్‌ కోసం పిల్లలపై ఒత్తిడి పెట్టొద్దు.. ప్రధాని మోదీ

సోషల్‌ స్టేటస్‌ కోసం పిల్లలపై ఒత్తిడి పెట్టొద్దని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పరీక్షల ముందు చిన్నారుల్లో ఒత్తిడి పోగొట్టేందుకు ప్రతి ఏడాది నిర్వహిస్తోన్న పరీక్షా పే చర్చ కార్యక్రమం తాజాగా ప్రారంభమైంది. ఇందుల్లో విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటిస్తున్నారు.ఇందుకు దిల్లీలోని తాల్కటోరా ఇండోర్‌ స్టేడియం వేదికైంది. ఈ సందర్బంగా విద్యార్థులతో సమయపాలన గురించి మాట్లాడారు. జీవితంలో సమయపాలన అతి ప్రధానమైనదన్నారు. రోజూ ఇంట్లో అమ్మను చూస్తే..సమయపాలన ఎలా నిర్వహించుకోవాలో మనకు తెలుస్తుందన్నారు. విద్యార్థుల ఒత్తిడిని ప్రధాని మోదీ క్రికెట్‌తో పోల్చారు. విద్యార్థులు సామర్థ్యాలను తక్కువ చేసుకోరాదన్నారు.ఇక ఈ కార్యక్రమంపై ఇంతకు ముందు ప్రధాని ట్విటర్‌లో స్పందించారు. ఈరోజు చిన్నారుల మధ్య ఉండటం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img