Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

స్టీల్‌ప్లాంట్‌ రక్షణ కోసం విశాఖలో భారీ ర్యాలీ

మోదీ సర్కారుకు గుణపాఠం తప్పదు : నేతలు

విశాఖ రూరల్‌ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు కదం తొక్కాయి. కార్మిక సంఘాల జేఏసీ అధ్వర్యంలో విశాఖలో భారీ ప్రదర్శన జరిగింది. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌ టీయూ, ఇతర కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కమిటీ నాయకులు, కార్యకర్తలు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ప్రదర్శనలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని డిమాండు చేశారు. ఆంధ్రులహక్కువిశాఖ ఉక్కు అని నినదిం చారు. విశాఖ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో వాలని డిమాండు చేశారు. స్టీల్‌ప్లాంట్‌ అమ్మకానికి వ్యతిరేకంగా రైల్వే డీఆర్‌ఎం ఆఫీస్‌ నుంచి జీవీ ఎంసీ గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన జరిగింది. అనం తరం జరిగిన బహిరంగసభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ విశాఖ పట్నం స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టిన మోదీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరిం చారు. బంగారు బాతు వంటి స్టీల్‌ప్లాంట్‌ను తెగనమ్ముతా మంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని హెచ్చరించారు. మందబలంతో మోదీ సర్కారు నియంతృత్వ విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. రైల్వే, ఎల్‌ఐసీ తదితర ప్రభుత్వరంగ సంస్థలు లాభాలతో నడుస్తుంటే వాటిని ఎందుకు ప్రైవేటుపరం చేస్తున్నారని ప్రశ్నించారు. పార్టీలకతీతంగా ఎంపీలంతా పార్లమెంటులో పోరాడాలని పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ రక్షణకు విశాఖ మేయర్‌, కార్పొరేటర్లు సోమవారం దీక్షకు పూనుకోవడాన్ని అభినందించారు. జేఏసీ చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించే చలో పార్లమెంట్‌కు అందరి మద్దతు ఉందని చెప్పారు. విశాఖతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరగనున్నాయని, ప్రజలు వాటిని జయప్రదం చేయాలని కోరారు. సీఐటీయూ నగర అధ్యక్షుడు ఆర్కేఎస్వీ కుమార్‌ అధ్యక్షత వహించారు. సీఎఫ్‌టీయూఐ నాయకులు ఎన్‌.కనకారావు, ఐఎఫ్‌టీయు నాయకులు వై.కొండన్న, ఏఐటీయూసీ నాయకులు కె.శంకరరావు, స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్‌, బి.ఆదినారాయణ, రమణారెడ్డి, నిర్వాసిత సంఘం నాయకుడు భాస్కరరావు, ఏఐటీయూసీ నాయకులు ఎస్‌కే రెహ్మన్‌, ఏఐఎఫ్‌టీయు నాయకులు గణేష్‌ పండా, రైతు సంఘం నాయకులు జి.నాయినబాబు, ఐద్వా నగర కార్యదర్శి ప్రియాంక, డీవైఎఫ్‌ఐ నేత యుఎస్‌ఎన్‌ రాజు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చిన్నారి, పీడీఎస్‌ఓ నాయకులు సురేష్‌, కళారంగ నాయకులు నిర్మల, తాతబాబు ప్రసంగించారు. సీఐటీయు నగర నాయకులు ఎస్‌.జ్యోతీశ్వరరావు, ఎం.కామేశ్వరి, సాగర్‌, కె.నాగేశ్వరరావు, జీటీపీ ప్రకాష్‌రావు, బి.జగన్‌, పి.పైడిరాజు, డి.అప్పల రాజు, వి.అప్పలరాజు, ఓ.అప్పారావు, వి.కృష్ణారావు, టి.నూకరాజు, ఎం.సుబ్బారావు, ఆర్‌పీ రాజు, వి.నరేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img