Friday, April 19, 2024
Friday, April 19, 2024

స్పుత్నిక్‌ లైట్‌ మూడో దశ టెస్టులకు డీసీజీఐ అనుమతి

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ లైట్‌ ఒక్క డోసు టీకా మూడో దశ ప్రయోగాలకి కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. దీంతో అతి త్వరలో ఈ టీకా ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.ప్రయోగాల్లో పాల్గొనే వారి ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియ ఈ వారంలోనే పారంభించనున్నట్లు సమాచారం. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం రష్యాకు చెందిన రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ఈ స్పుత్నిక్‌ లైట్‌ ఒక్క డోసు టీకాను అభివృద్ధి చేసింది. ఇది కరోనాపై 78.6 శాతం నుంచి 83.7శాతం సమర్థతతో పనిచేస్తుందని ఆర్‌డీఐఎఫ్‌ వెల్లడిరచింది. దీన్ని భారత్‌లోకి తీసుకొచ్చేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ రష్యాతో ఒప్పందం చేసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img