Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

‘స్వచ్ఛత’కు ప్రాధాన్యతివ్వాలి

అఖిలభారత మేయర్ల సదస్సులో ప్రధాని మోదీ
వారణాసి : పారిశుద్ధం (స్వచ్ఛత)కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. దీనిని నిర్లక్ష్యంచేసే నగరాలను గుర్తించి, వాటి పేర్లతో జాబితాను రూపొందించాలనిÑ అదే సమయంలో స్వచ్ఛతను తూ.చ. తప్పకుండా పాటించే నగరాలకు ‘స్వచ్ఛత’ అవార్డులు ఇవ్వాలని సూచించారు. ఆయన శుక్రవారం వారణాసిలో జరిగిన అఖిలభారత మేయర్ల సదస్సులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. స్వచ్ఛతా అభియాన్‌ను పట్టించుకోని నగరాల జాబితాలను తయారు చేయాలని సూచించారు. స్వచ్ఛతా ఎక్సలెన్స్‌ అవార్డులను పారిశుద్ధ్యం పాఠించే నగరాలకు ఇవ్వాలని కేంద్రమంత్రి హరదీప్‌ సింగ్‌ పూరిని ఆదేశించారు. స్వచ్ఛభారత్‌ అభియాన్‌ దిశగా తీవ్ర కసరత్తు చేసే వారిని గుర్తించాలన్నారు. ‘నది ఉత్సవ్‌’ (నదుల ఉత్సవం) ప్రతి వారం నిర్వహించాలని, ఇందులో స్థానికులను భాగస్వాములు చేయాలని సూచించారు. అలాగే నగరాల పుట్టినరోజులు జరిపి, వాటి విశిష్టతను చాటాలని అన్నారు. దేశవ్యాప్తంగా 120 మందికిపైగా మేయర్లు ‘న్యూ అర్బన్‌ ఇండియా’ సదస్సులో పాల్గొన్నారు. వారణాసి లోక్‌సభ సభ్యునిగా మోదీ వారందరికీ స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img