Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కొత్తగా 13,086 కేసులు
భారత్‌లో కొత్త కరోనా కేసులు కాస్త తగ్గాయి. తాజాగా 4.51 లక్షల మందికి కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా,,13,086 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇదే సమయంలో 12,456 మంది కరోనా నుంచి కోలుకోగా… 24 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,13,864 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,35,31,650కి చేరుకుంది. వీరిలో 4,28,79,477 మంది కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 5,25,223కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల రేటు 0.26 శాతంగా, రికవరీ రేటు 98.53 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, పాజిటివిటీ రేటు 2.90 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,97,98,21,197 డోసుల కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. నిన్న 1,78,383 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img