Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన హిజాబ్‌ వస్త్రధారణ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. హిజాబ్‌ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని పేర్కొంది. విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది.ఈ అంశంపై దాఖలైన పలు పిటీషన్లలను ఉన్నతన్యాయస్థానం కొట్టివేసింది. విద్యాసంస్థల ప్రోటోకాల్‌ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టంచేసింది. యూనిఫామ్‌ను ధరించడమనేది ఫ్రాథమిక హక్కులకు భంగం కాదు అని, కేవలం ఆంక్ష మాత్రమే అవుతుందని కోర్టు తెలిపింది.జస్టిస్‌ రీతు రాజ్‌ అవాస్తీ ఇవాళ కోర్టు తీర్పును వెలువరించారు. ఫిబ్రవరి 5న జారీ చేసిన ప్రభుత్వ జీవోను నిర్వీర్యం చేయడంలేదని కోర్టు చెప్పింది.మరో వైపు హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నేడు బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు జారీ చేశారు. నేటి నుంచి మార్చి 19 వరకు ఈ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. ఉడుపిలో నేడు స్కూళ్లు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img