Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం

వాహనాలపై విరిగిపడిన కొండచరియలు.. శిథిలాల కింద 40మంది?
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిన్నౌర్‌ జిల్లోని రెఖాంగ్‌ పీయో`షిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం 12:45 గంటలకు ఒక్కసారిగా భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. కొండ చరియల కింద ఒక లారీ, ఆర్టీసీ బస్సుతో పాటు పలు వాహనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాహనాల్లో సుమారు 40 మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.సంఘటన స్థలానికి చేరుకున్న ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు.తొమ్మిదిమందిన రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌తో ఫోనులో మాట్లాడారు. కేంద్రం తరపున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img