Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

హైకోర్టు ఆదేశాలతో దిగివచ్చిన పోలీసుశాఖ

. విద్యార్థి, యువజన నేతల నుంచి వివరాల సేకరణ
. 25 నుంచి నిర్వహించేందుకు నేతల సన్నద్ధం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన బస్సు యాత్ర జరగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాల ప్రయత్నిస్తోంది. అయితే హైకోర్టు ఆదేశాలతో పోలీసుశాఖలో కొంత కదలిక వచ్చింది. ఇప్పటివరకూ స్పందించకుండా మౌనంగా ఉండిపోయిన రాష్ట్ర డీజీపీ కార్యాలయం…హైకోర్టు ఆదేశాల తర్వాత ఎట్టకేలకు దిగివచ్చినట్లయింది. అన్ని సక్రమంగా జరిగి, పోలీసుశాఖ నుంచి అనుమతులొస్తే ఈనెల 25 తర్వాత బస్సు యాత్రను విద్యార్థి, యువజన సంఘాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం విద్యార్థి, యువజన సంఘాల నేతలు ఈనెల 20వ తేదీ నుంచి సత్యసాయిజిల్లా అనంతపురంజిల్లా నుంచి శ్రీకాకుళంజిల్లా ఇచ్చాపురం వరకు దాదాపు 16,801 కిలోమీటర్లపాటు బస్సు యాత్రకు ప్రణాళిక రూపొందించారు. దీనిపై రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి ఈ నెల 5వ తేదీన అనుమతుల కోసం విద్యార్థి, యువజన సంఘాల నేతలు దరఖాస్తు చేయగా…డీజీపీ కార్యాలయం స్పందించకుండా మౌనంగా ఉండిపోయింది. దీనిపై జవాబివ్వాలని కోరుతూ మళ్లీ ఈ నెల 17వ తేదీన వినతి అందజేశారు. అప్పటికీ డీజీపీ కార్యాలయం స్పందించకపోవడంతో ఈ నెల 19వ తేదీన హైకోర్టులో ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై ధర్మాసనం స్పందించి ఈ నెల 25లోగా యాత్రకు పోలీసుల అనుమతివ్వాలనీ, లేకుంటే కోర్టు నుంచే అనుమతిస్తామని డీజీపీని ఆదేశించింది.ఈ మేరకు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం చేపట్టే బస్సుయాత్రకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వుల మేరకు అనుమతి కోసం శుక్రవారం డీజీపీ కార్యాలయంలో డీఐజీ (లా అండ్‌ ఆర్డర్‌) అమ్మిరెడ్డిని యువజన, విద్యార్థి సంఘాల నేతలు పరుచూరి రాజేంద్రబాబు, కె.శివారెడ్డి, రాము, లంకా గోవిందరాజు కలసి బస్సు యాత్రకు సంబంధించిన వివరాలు అందజేశారు. డీజీపీ కార్యాలయం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ నెల 25వ తేదీ తర్వాత పాదయాత్ర చేపడతామని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు వెల్లడిరచారు. మొత్తంమీద హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసుశాఖ దిగివచ్చినట్లయింది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు చేపడుతున్న వివిధ ఉద్యమాలకు జగన్‌ ప్రభుత్వం అనుమతివ్వకుండా నిరంకుశంగా వ్యవహరిస్తోంది. ఇటీవల జీవో నంబరు`1 జారీజేసి, దాని సాకుతో ప్రతిపక్ష పార్టీల ఉద్యమాన్ని అణచివేతకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img