Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

100 శాతం ఎఫ్‌డీఐ

టెలికంలో చట్టబద్ధ బకాయిల చెల్లింపులపై నాలుగేళ్ల మారటోరియం
భారీ సంస్కరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
ఆటో రంగానికి రూ.26 వేల కోట్ల ప్రోత్సాహకాలు

న్యూదిల్లీ : భారీ సంస్కరణల్లో భాగంగా టెలికం రంగానికి ఒక ఉపశమన ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. వోడాఫోన్‌ ఐడియా వంటి కంపెనీలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో చట్టబద్ధ బకాయిల చెల్లింపుపై నాలుగు సంవత్సరాల మారటోరియం, ఆటోమేటిక్‌ మార్గంలో ఈ రంగంలో సుమారు 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ రంగం కోసం తొమ్మిది నిర్మాణాత్మక సంస్కరణలు, ఐదు ప్రక్రియ సంస్కరణలను మంత్రివర్గం ఆమోదించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడుతూ టెలికం రంగంలో ఒత్తిడికి ఏజీఆర్‌ బకాయిలు ప్రధాన కారణమని అభిప్రాయ పడ్డారు. అందుకే ఏజీఆర్‌ నిర్వచనాన్ని హేతుబద్ధీకరి స్తున్నట్లు తెలిపారు. ఇకపై టెలికంయేతర ఆదాయాలను ఏజీఆర్‌ నుంచి మినహాయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. ఏజీఆర్‌ అనేది చట్టబద్ధ చెల్లింపు కోసం పరిగణించబడే ఆదాయాలను సూచిస్తుంది. ఆటోమేటిక్‌ మార్గం ద్వారా టెలికంలో 100 శాతం ఎఫ్‌డీఐలను ఆమోదించిందని అన్నారు. చెల్లించని బకాయిలు, ఏజీఆర్‌, స్ప్రెక్టమ్‌ బకాయిలపై నాలుగేళ్లపాటు మారటోరి యం విధించినట్లు ఆయన వివరించారు. వివిధ లైసెన్స్‌ ఫీజులు, చార్జీలపై పెనాల్టీ, వడ్డీ హేతుబద్ధం చేయబ డిరది. అలాగే భవిష్యత్‌ వేలంలో స్పెక్ట్రం కాలవ్యవధి 20 సంవత్సరాలకు బదులుగా 30 సంవత్సరాలు చేయనున్నట్లు తెలిపారు. వ్యాపార వాతావరణంలో మార్పు విషయంలో స్థిర చార్జీ చెల్లించిన తర్వాత కంపెనీలు స్పెక్ట్రమ్‌ను అప్పగించడానికి

కేంద్రం అనుమతించింది. కాగా ‘ప్రధాన మంత్రి ఈరోజు ఏజీఆర్‌ (సర్దు బాటు చేసిన స్థూల ఆదాయం) పై సాహసోపేతమైన నిర్ణయం తీసుకు న్నారు’ అని అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. అక్టోబర్‌ 1 నుండి సంస్కరణలు వర్తిస్తాయని, 5జీ స్పెక్ట్రం వేలం వేసినప్పుడు మరిన్ని సంస్కరణలు ఉంటా యని తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల టెలికం రంగంలో కొన్ని కంపెనీలకు నగదు కొరత తీరుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇదిలాఉండగా, ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాలని టెలికం కంపెనీలకు సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. వేల కోట్ల రూపాయలు ఒక్కసారి చెల్లించడం భారంతో కూడుకున్నదని పేర్కొంటూ ఆయా కంపెనీలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఏజీఆర్‌ బకాయిలను 10 ఏళ్లలో చెల్లించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఎక్కువగా బకాయి పడిన వొడాఫోన్‌ ఐడియా ఇప్పటికే రూ.7,854 కోట్లు చెల్లించింది. మరో రూ.50 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అప్పుల్లో కూరుకుపోయిన తమ కంపెనీని ప్రభుత్వమే ఆదుకోవాలని అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా టెలికాం రంగానికి తక్షణ నగదు ప్రవాహ ఉపశమనం ఆర్థిక ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని, 5జీ వేలానికి మార్గం సుగమం చేస్తుందని డెలాయిట్‌ ఇండియా సీనియర్‌ విశ్లేషకుడు చెప్పారు.
వాహన రంగానికి భారీ ప్రోత్సాహకాలు
దేశీయ వాహన రంగానికి రూ.26,058 కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్‌ఐ) ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కబినెట్‌ సమావేశంలో ఈ మేరకు ఆమోదించింది. ఈ పథకం ద్వారా ఆటో రంగంలో దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చని అంచనా వేస్తోంది. ఆటో, ఆటో విడిభాగాలు, డ్రోన్‌ పరిశ్రమకు ఈ ప్రోత్సాహక పథకం ప్రకటించింది.
ఇందులో రూ.25,938 కోట్లు ఆటో రంగానికి కాగా, రూ.120 కోట్లు డ్రోన్‌ పరిశ్రమకు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడిరచారు. అయితే ఈ పథకం కేవలం స్వచ్ఛ ఇంధన ఆధారిత వాహన తయారీ సంస్థలకు మాత్రమే. 2022`23 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల వ్యవధిలో ఈ పథకాన్ని ప్రకటించింది. 10 వాహన తయారీ సంస్థలు, 50 ఆటో విడిభాగాల ఉత్పత్తి సంస్థలు దీని నుంచి లబ్ధి పొందుతాయని కేంద్రం చెబుతోంది.
‘విపత్తు’ నిర్వహణపై ఇటలీ సంస్థతో ఎంవోయూ
విపత్తు ప్రమాదాన్ని తగ్గించడం, నిర్వహణ రంగంలో సహకారం కోసం ఎన్‌డీఎంఏ, ఒక ఇటలీ ప్రభుత్వ సంస్థ మధ్య ఒక అవగాహన ఒప్పందం గురించి కేంద్ర మంత్రివర్గం తెలియజేసింది. జూన్‌ 2021లో సంతకం చేసిన అవగాహన ఒప్పందం(ఎంవోయూ) ఒక వ్యవస్థను రూపొందించడానికి ప్రయత్నిస్తుందని, దీని ద్వారా భారత్‌, ఇటలీ రెండూ ఒకదానికొకటి విపత్తు నిర్వహణ యంత్రాంగాల నుండి ప్రయోజనం పొందుతాయని వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img