Friday, April 19, 2024
Friday, April 19, 2024

1200లకు క్షీణించిన కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖంపట్టాయి. నిన్న మొన్నటి వరకు రెండు వేలు, పదిహేను వందలు లోపే నమోదైన కేసులు నేడు 1200కు చేరాయి.మరణాలు కూడా అదే స్థాయిలో తగ్గడం ఊరట కలిగిస్తోంది.ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ గణాంకాలు వెల్లడిరచింది. గడిచిన 24 గంటల్లో 1,270 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న 149గా ఉన్న కరోనా మరణాలు నేడు 31కి తగ్గాయి.పలు రాష్ట్రాలు మునుపటి గణాంకాలను సవరిస్తుండటంతో మృతుల సంఖ్యలో వ్యత్యాసం కనిపిస్తోంది. ఇప్పటివరకూ మహమ్మారి ధాటికి 5.21 లక్షల మంది మృతి చెందారు. ఇక నిన్న 1,567 మంది కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.75 శాతానికి చేరింది. ఇక దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మార్చి 31 నుంచి కరోనా ఆంక్షలన్నీ ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించిన విషయం తెలిసిందే. కరోనావైరస్‌, వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించేందుకు టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన ప్రీకాల్‌- ఆడియో ప్రకటనలు, కాలర్‌ ట్యూన్లను నిలిపివేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img